యుఎన్‌జిఎ 74వ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యుఎన్‌జిఎ) లో జరిగిన చర్చలో పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఎఫెక్టివ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్, ఇంక్లూషన్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అనే అంశంపై ప్రధాని ప్రసంగించారు. 

నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2015, సెప్టెంబరు 25వ తేదీన ప్రధాని యుఎన్‌జిఎ ప్రత్యేక శిఖరాగ్ర సదస్సులో ప్రపంచదేశాల నాయకులను కలిశారు. వీరంతా కలిసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ‘ఎజెండా 2030’ ని చేపట్టారు. జాతీయ అభివృద్ధి పరంగా పెట్టుకున్న అభివృద్ధి లక్ష్యాలను భారత్ అజేయంగా సాధించగలిగిందని సమావేశంలో పేర్కొన్నారు. ఇది ‘ఎజెండా 2030’ లక్ష్య విజయానికి శుభ ప్రారంభంగా చెప్పాలి. ముఖ్యంగా పేదరిక నిర్మూలనాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఇది బాగా ఫోకస్ అవడంలో స్థిరమైన పాత్ర పోషించారు. ఈ సమావేశం పలు కార్యక్రమాల గురించి వివరించింది. ఇవి పేదరిక నిర్మూలనా దిశగానే కాకుండా అందరినీ కలుపుకుపోవడం, ప్రపంచానికి సరికొత్త ‘ఆశ’ను చూపడం ప్రధానంగా పెట్టుకున్నాయి. ఇవి చేపట్టిన కార్యక్రమాలలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫైనాన్సియల్ ఇంక్లూషన్ పథకం కూడా ఉంది. అలాగే జన్ ధన్ యోజనా కూడా ఉంది. ఇది దు సంవత్సరాల కాలంలో 370 మిలియన్నల బ్యాంకు అకౌంట్లు తెరవడానికి కారణమైంది. ఇది భారతదేశంలోని పేద ప్రజలను సాధికారులుగా మలిచే పథకం. ఆధార్ కార్యక్రమం కూడా భారతదేశంలోని 1.2 బిలియన్ నివాసులను డిజిటల్‌గా సాధికారులుగా నిలబెట్టింది. ఇది ఈ కార్యక్రమం చేపట్టిన బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్, అవినీతి వ్యతిరేక పాలనా పద్ధతుల ద్వారా చేసింది. ప్రజారోగ్య కార్యక్రమం మరొకటి. ఇది కూడా ప్రపంచంలో అతి పెద్ద కార్యక్రమం. ఉదాహరణకు ప్రపంచంలోనే అతి విస్తృతంగా, భారీగా పారిశుద్ద్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. స్వచ్ఛ భారత్ ప్రచారానికి పూనుకుంది. వీటితో పాటు 110 మిలియన్ టాయిలెట్లను ఐదు సంవత్సరాల కాలంలో కట్టించింది. తద్వారా బహిర్భూమి అలవాటుకు ప్రజలను దూరం చేయడానికి కృషిచేసింది. ఆయుష్మాన్ భారత్ అనే మరో పెద్ద హెల్త్ కేర్ పథకం ఉంది. దానికింద 500 మిలియన్ల ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కేర్ పరిధిలోకి తీసుకువచ్చింది.

భారత్ 2025 సంవత్సరం నాటికి టిబిని పూర్తిగా నిర్మూలించాలని నిశ్చయించుకుంది. దాంతోపాటు తాగునీటిని ఐదు సంవత్సరాల కాంలో 150 మిలియన్ కుటుంబాలకు అందించాలని భావించింది. అంతేకాదు పేద ప్రజలకు 2022 సంవత్సరం నాటికి 20 మిలియన్ ఇళ్లను కట్టించాలని టార్గెట్ పెట్టుకుంది. 

వాతావరణ మార్పుల మీద కూడా ప్రధాని ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ శిఖరాగ్రసమావేశంలో పాల్గొన్నారు. 175 జిడబ్ల్యు నుంచి 450 జిడ్య్లు వరకూ ఎనర్జీ పునరుత్పత్తిని పెంచాలని భారత్ నిశ్చయించుకుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాదు కేవలం ఐదు సంవత్సరాల కాలంలో ప్లాస్టిక్ నంపూర్ణ నిషేధాన్ని భారత్ పూర్తిచేస్తుందని చెప్పారు. భారత్ వాతావరణ పరమైన చర్యలపై కూడా గ్లోబల్ స్థాయిలో దృష్టి పెట్టింది. అందులో సోలార్ అలయెన్స్‌ తో పాటు అంతర్జాతీయంగా కొయెలేషన్ ఫర్ డిజాస్టర్ రిశాలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సిడాఆర్ఐ) పరంగా కూడా మౌలికసదుపాయాలను నిర్మించాలన్న ప్రతిపాదనతో ఉంది. దీనివల్ల ప్రకృతి సిద్ధంగా సంభవించే వైపరిత్యాలను తట్టుకోగలం. 

 సుస్థిర అభివృద్ధి పరంగా భారత విజయాలను ప్రధాని నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. ప్రజాసంక్షేమం దృష్టిలో ఇవి చేపట్టామన్నారు. అలాగే శాంతి స్థాపన కూడా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం భారత్ ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తోందన్నారు. కేవలం ప్రజల సంక్షేమం కోసమే తమ కృషి కాదని మొత్తం ప్రపంచ సంక్షేమం కూడా తమ ఉద్దేశమని మోదీ అన్నారు. అందుకే ప్రధాని మాట్లాడుతూ ‘ మా నినాదం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అని ఈ సమావేశంలో ప్రధాని పునరుద్ఘాటించారు. 

ప్రస్తుతం ఉన్న సవాళ్ల నేపథ్యంలో బహుపక్ష వ్యవస్థ చూస్తున్నారు. తన ప్రసంగంలో ప్రధాని భారత్ బహపక్షవాదానికి పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. 

 అంతేకాదు తాత్విక విధానంలోంచి చూస్తే, భారత శతాబ్దాల చరిత్ర ఉన్న సాంస్కృతిక సంప్రదాయాలు మానవజాతి విధిని తెలుపుతుందన్నారు. ఈ సందర్భంగా తమిళ కవి కనియాన్ పుంగుద్రనార్ కవిత్వంలోని ‘ మేం అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్లం, ప్రతి చోటా మేముంటాం’ అన్న పలుకులను ప్రస్తావించారు. 1893లో స్వామి వివేకానంద ‘వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ ఆఫ్ హార్మొనీ అండ్ పీస్ ’ సమావేశ ప్రాధాన్యాన్ని కూడా ప్రధాని నొక్కి చెప్పారు. అంతేకాదు జాతిపిత మహాత్మాగాంధీ అహింస, సత్యగ్రహాలను కూడా పునరుద్ఘాటించారు. 

బహుపక్షవాదాన్ని బలోపేతం చేయడానికి వాస్తవంగా చేయాల్సిన కృషి గురించి ఆలోచిస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశం ఐక్యరాజ్యసమితి శాంతిమిషన్‌కు అధిక సంఖ్యలో సైన్యాన్ని పంపుతున్న పెద్ద దేశంగా పేర్కొన్నారు. భారత దేశం ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు. బుద్ధుని శాంతి సందేశాన్ని ఎప్పుడూ చెబుతూ వచ్చింది అన్నారు. ఉగ్రవాదం ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా మోదీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ మానవాళి రక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలన్నారు.  

కొత్త సాంకేతిక పరిజ్గానం వేగంగా మారుతున్న పరిణామాలను పేర్కొంటూ, సామాజిక జీవితం, వ్యక్తిగత జీవితం, ఆర్థికపరిస్థితులు, రక్షణ, అనుసంధానత, అంతర్జాతీయ సంబంధాలను నూతన సాంకేతిక పరిజ్ఘానం మారుస్తోందన్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ ముందుకుసాగాలన్నారు. ప్రాంతాలన్నీ చిన్న చిన్న ముక్కలు కాకుండా అడ్డుకోవాలన్నారు. కొత్తదిశగా పయనించాలన్నారు. బహుపక్ష వాదానికి శక్తినివ్వాలి. అలాగే ఐక్యరాజ్యసమితిని కూడా పటిష్టపరచాలి. 

యుఎన్‌జిఎ 74 వ సదస్సు జూన్, 2019లో చేపట్టిన తీర్మానాన్ని సభ్య దేశాలన్నీ అమలు పరచాలని ఆదేశించింది. బహుపక్షవాదానికి సమిష్టిగా కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించింది. ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ఈ లక్ష్యాన్ని సాధించడానికి రోడ్ మ్యాప్ తయారుచేయడంలో ఏ విధంగా భారత్ సుస్థిరమైన పాత్రను పోషించనుందో సూచించారు. దీన్ని 2020 సెప్టెంబరులో జరిగే యుఎన్ వార్షిక శిఖరాగ్రసదస్సులో చేపడతారు. 

రచన: అంబాసిడర్ అశోక్ ముకర్జీ, ఐక్యరాజ్యసమితికి భారత మాజి శాశ్వత ప్రతినిధి