అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీలంక

శ్రీలంకలో ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణంలాగే దాని రాజకీయ చిత్రపటం కూడా వైవిధ్యమైన మార్పులను ప్రతిబింబిస్తోంది. నవంబరు 16వ తేదీన నాల్గవ దేశాధ్యక్షుని ఎన్నికల దిశగా ఆ దేశం ముందుకుసాగుతోంది. శ్రీలంకలో ఇప్పటివరకూ రాజకీయ ప్రచారం ఎలాంటి గొడవలకు తావులేకుండా నిశ్శబ్దంగా సాగిపోయింది. అలా అని నిరుత్సాహకర వాతావరణం కూడా ఏమీ లంకలో లేదు. ఆ దేశ రాజ్యాంగంలో ఎన్నికల ప్రహసనం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది.  శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఆ దేశ ఎన్నికల కార్యాలయం ఎంతో శక్తివంతమైంది.  ఇది కొంతవరకూ అసాధారణ విషయంగా కనిపించినా ఆశ్చర్యమైన విషయం మాత్రం కాదు. అయితే ఎన్నికల పట్ల ప్రజల్లో తగినంత ఆసక్తి లేకపోవడానికి కారణం ఇప్పటికీ అక్కడ ప్రజలు ఈస్టర్ సండే రోజు జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులను మరిచిపోలేకపోతున్నారు. దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజల ముందు కొత్తగా పెట్టేదేమీ లేదు కూడా. 

మాజీ రక్షణ కార్యదర్శి గోటాబాయా రాజపక్సే ఎన్నికల బరిలో సరైన సమయంలో దిగారు. గోటాబాయా శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే చిన్న సోదరుడు. సంవత్సరం ప్రారంభంలో ఆయన తన అమెరికన్ పౌరసత్వాన్ని వీడి శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకోనున్నట్టు ప్రకటించారు. దేశంలోనే అత్యున్నత పదవైన అధ్యక్ష పదవి బరిలో నిలబడడానికి  శ్రీలంక జాతీయుడిగా మారారు. తన పౌరసత్వాన్ని మార్చుకున్నప్పటికీ, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఆయన శ్రీలంక పౌరసత్వానికి ఆ దేశ చట్టాల కింద ఎంతవరకూ చట్టబద్ధత ఉందన్న అంశంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని విషయాల పరంగా ఇప్పటికీ ఒక స్పష్టతకు రాలేదు. కోర్టుల ముందు వాటికి సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

 ఎల్‌టిటిఇకి వ్యతిరేకంగా యుద్ధం జరపడంలో గోటాబాయా రాజపక్సే ఎంతో కీలకపాత్ర వహించారు. తన పెద్ద అన్న విధానాలనే గోటాబాయా రాజపక్సే కూడా అనుసరించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గోటాబాయా మాత్రం తాను మధ్యే తటస్థ మార్గాన్ని అనుసరిస్తానని స్పష్టంచేశారు. దేశ అభివృద్ధి కోసం కృషిచేస్తానన్నారు. ఆయన  సింహళీల మరీ ముఖ్యంగా దేశంలోని దక్షిణ భాగంలో నివసిస్తున్న వారి మద్దతుపై ఎక్కువ ఆధారపడ్డారు. 

మరోవైపు శ్రీలంక ప్రధానమంత్రి రనీల్ విక్రమసింఘే అధికార పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విక్రమసింఘేకి ఎప్పటి నుంచో శ్రీలంక అధ్యక్షుడు కావాలనే కోరిక ఉంది. అది పక్కన పెడిత, ఆయన చాలా అనుభవజ్ఘుడైన అభ్యర్థి కూడా. విక్రమసింఘే ఐదు పర్యాయాలు శ్రీలంక దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటరీ సభ్యుడిగా అనితర సేవలు అందిస్తూ వస్తున్నారు. వీటితోపాటు తన పార్టీకి 25 సంవత్సరాలుగా నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అయినా కూడా ఆయన పార్టీలోని చాలామంది ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం పట్ల సంతృప్తికరంగా లేరు. ఆయన సమయం అయిపోయిందని, ఎవరికైన యువకుడికి, డైనమిక్గా ఉండే వ్యక్తికి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. సిరిసేనా ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న సాజిత్ ప్రేమదాసా ఎవరో తెలిసే ఉంటుంది. ఆయన శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనసింఘే ప్రేమదాస తనయుడు. ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వానికి సరిపోతాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ విక్రమసింఘే ఎన్నికల రణంలో ఉండడంతో, పార్టీ కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతోంది. అందుకే ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మెల్లగా, ఎంతో చప్పగా మొదలైంది. 

సాజిత్ ప్రేమదాస కూడా తొందరలోనే శ్రీలంక అధ్యక్ష పదవీ పోటీకి తన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించనున్నారని పలువురు విశ్వసిస్తున్నారు. దీంతో ఇద్దరు నమ్మదగ్గ, బలమైన నాయకులు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండబోతారనమాట. దాంతో ఎన్నికల ప్రచారం మెల్లగా ఊపందుకుంటుంది. విక్రమసింఘే ‘ఇమేజ్’ కొలొబో పాలకవర్గ మేథావులకు ప్రతిబింబింగా ఉందన్న భావన ఉంది. అదే సమయంలో సాజిత్ ప్రేమదాసా దక్షిణాదిన ఉన్న సింహళీయుల బలమైన మద్దతును ఆశిస్తున్నారు. ఈయన తండ్రికి ప్రజల్లో మంచి పేరు ఉంది. పైగా రణసింఘే ప్రేమదాసా తన సమయంలో సింహళీయుల జాతీయవాద సెంటిమెంటుకు ప్రధాన ప్రతిపాదకులుగా కూడా ఉన్నారు. 

మొత్తం మీద, శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు మామూలు కన్నా కూడా అధికంగా ఉన్నాయి. దీనికి కారణం, వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ దేశం తాజా పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్లనుంది. గతంలో లాగ అధ్యక్ష పదవితో పాటు అన్నింటికి సంబంధించి ఫలితాలు ముందు జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. దీని తర్వాత ఇప్పటి వరకూ దాటవేస్తూ వచ్చిన ప్రొవెన్షియల్ కౌన్నిల్ ఎన్నికలు కూడా  జరుగుతాయి. అందుకే ఇప్పటి వరకూ శ్రీలంక ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా, ఎలాంటి గొడలు లేకుండా సాగిపోతున్నా, రానున్న వారాల్లో మాత్రం ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికలకు అవసరమైన ప్రచార మూడ్‌ను సెట్ చేస్తుంది. ఈ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. 

భారత్‌కు శ్రీలంక అత్యంత సన్నిహిత పొరుగు దేశం. అంతేకాదు శ్రీలంక మనకు మంచి మిత్రదేశం కూడా. అందుకే ఆ దేశంలో శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరగాలని భారత్ కోరుకుంటోంది. ఈస్టర్ ఉగ్రదాడుల అనంతరం భారత్ తన సంపూర్ణ  మద్దతును కొలోంబోకు ప్రకటించింది. తన సంఘీభావాన్ని సైతం ఈ సందర్భంగా కొలంబోకు భారత్ తెలిపింది. దక్షిణాశియాలో శాంతి, అభివృద్ధులపరంగా ప్రజాస్వామ్యయుతమైన, బహుముఖమైన శ్రీలంక కూడా సుసాధ్యానికి కొంత కష్టమే అవుతుంది.

రచన: ఎం.కె. టిక్కు, రాజకీయ వ్యాఖ్యాత