పాకిస్తాన్ విద్వేషాన్నిస్వీకరించడానకి ఎవ్వరూ సిద్ధంగా లేరు

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రయత్నాలు 74వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో కూడా వైఫల్యం చెందాయి. జమ్ము,కశ్మీర్ రాష్ట్రాల ప్రజల ఈతిబాధలపై తన ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. కానీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ యుద్ధ ప్రస్తావన కూడా తెచ్చారు. అంతేకాదు ‘న్యూక్లియర్’ అనే పదాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించారు. అందరి దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో పాక్ ప్రసంగ తీరు కొనసాగింది. 

 అమెరికా యంత్రాంగం నుంచి కూడా కశ్మీర్ అంశంపై ఎలాంటి మద్దతు లభించడం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ గుర్తించారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక సందర్భంలో స్పందిస్తూ కశ్మీరీల గురించి మాట్లాడుతున్నంతగా యుఘుర్స్ బాధితులు పడుతున్న కష్టాలపై పాక్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడం లేదని కూడా తీవ్రంగా విమర్శించింది దక్షిణ, మధ్య ఆసియా యాక్టింగ్ సహాయ కార్యదర్శి అలిస్ వెల్స్ మాట్లాడుతూ ‘కశ్మీర్‌పై గొంతు తగ్గించడం అవసరం అన్నారు. ముఖ్యంగా రెండు న్యూక్లియర్ దేశాలు కూడా ’ అని ఆమె అభిప్రాయపడ్డారు. మిస్ వెల్స్ మాట్లాడుతూ ఎందుకు పాకిస్తాన్ ప్రధాని చైనాకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఒక మిలియన్ పైగా ఉఘర్ ముస్లింలను చైనా నిర్బంధించింది. వారిని హాన్ చైనీస్ సంప్రదాయాలతో కలపాలని చైనా చూస్తోంది. ఉఘర్స్ పడుతున్న కష్టాలపై స్పందించడానికి పాక్ ప్రధాని నిరాకరించారు. కారణం పాకిస్తాన్‌ చైనాతో ‘ప్రత్యేక సంబంధాల’ను ఉండడమేనంటూ ఖాన్ వ్యాఖ్యానించారు కూడా.

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి 74వ సభలో పాకిస్తాన్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి భారత స్పందన వాస్తవంగా, ఎంతో పరిణితితో కూడినదిగా ఉంది. పాకిస్తాన్ నాయకుడు న్యూక్లియర్ అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం వినాశనం అంచులను తెలుపుతోంది గాని, రాజనీతిజ్ఘతను కాదు అని భారత్ వ్యాఖ్యానించింది. 

అంతేకాదు పాకిస్తాన్ ప్రధాని ప్రసంగం ఐక్యరాజ్యసమితిలో అభిప్రాయవిభేదాలు తలెత్తేలా, విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కనిపించిందని ఇండియా అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితిలో భారత తొలి కార్యదర్శి శ్రీమతి విదిషామైత్రా మాట్లాడుతూ ‘ఉగ్రవాదానికి నెలవైన,  అలాంటి విలువలతో నిండి ఉన్న పరిశ్రమను ఏలుతున్న దేశం నుంచి వచ్చిన నాయకుడు, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను తాను సమర్థించుకోవడాన్ని ఆమె ప్రశ్నించారు.

పాక్‌లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా లేదా  రూఢీ చేసేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యుఎన్ పరిశీలకులను పాకిస్తాన్‌కు ఆహ్వానించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుతెచ్చారు. ఆ మాటను ఖాన్ నిలబెట్టుకునేలా ప్రపంచం పాకిస్తాన్‌ను ప్రశ్నించాలన్నారు. భారత ప్రతినిధి అయిన ఆమె మరో ప్రశ్నను కూడా ఈ సందర్భంగా అడిగారు. పాకిస్తాన్‌లో యుఎన్ గుర్తించిన 130 మంది ఉగ్రవాదులు ఉన్నారని, అలాగే 25 ఉగ్రసంస్థలు ఉన్నాయని చెపుతూ వాటి జాబితాను యుఎన్ రూపొందించిన విషయం గుర్తుచేశారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్కు ఫోర్సు  20 నుంచి 27 కీలక అంశాల పరంగా పాకిస్తాన్‌ నిబంధనలను అతిక్రమించిందని ప్రస్తావించడాన్ని వ్యతిరేకించగలదా అని ఆమె ప్రశ్నించారు. 

జనజీవనస్రవంతిలో ఉగ్రవాదం చొరబడింది. విద్వేష ప్రసంగాలుపెరిగాయి. మానవహక్కుల ఛాంపియన్‌గా పాకిస్తాన్ తన కొత్త అవతరాన్ని ప్రదర్శిస్తోంది. భారత్ కూడా యుఎన్లోని 193 మందియ సభ్యులు పాకిస్తాన్‌లోని మైనారిటీలు 1947లో 23 శాతం ఉంటే వారి సంఖ్య నేడు 3 శాతం మాత్రమే ఉండడాన్ని సభలో ప్రస్తావించారు. క్రిస్టియన్, సిక్కులు, అహ్మదీయులు, హిందూలు, షియాలు, పస్తూన్లు, సింధీలు, బలోచీలు దైవ దూషణ చట్టాలకు బలయ్యారు. వారిని పద్ధతి ప్రకారం హింసకు గురిచేస్తున్నారు. తీవ్రమైన దూషణలకు పాల్పడుతున్నారు. అంతేకాదు బలవంతంగా వారిని ఇస్లాంలోకి మతమార్పిడి చేస్తున్నారు.

పాకిస్తాన్ కొత్తగా ఆలపిస్తున్న మానవహక్కుల రాగం కేవలం అందరి మనసులను గెలవాలనే ప్రయత్నమని భారత్ వ్యాఖ్యానించింది. భారత ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, 1971లో పాకిస్తాన్ భారత్‌లో పాల్పడ్డ అత్యంతక్రూరమైన మానవజాతి సంహారాన్ని  ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కాలంచెల్లిన 370వ భారత రాజ్యాంగ అధికరణం భారతదేశ సమైక్యతను, అలాగే జమ్ము, కశ్మీర్‌ల అభివృద్ధిను అడ్డుకుంటోందన్నారు. ఘర్షణ కోరేవారు శాంతిని ఎప్పటికీ కోరుకోరు.  అత్యున్నత ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. విద్వేషాన్ని నలుదిశలా వ్యాపింపచేస్తోంది. భారతదేశం జమ్ము,కశ్మీర్‌లలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తోంది.  

 జమ్ము, కశ్మీర్, లదాఖ్‌లను ప్రధాన స్రవంతిలోకి భారత్ తెచ్చింది. వైవిధ్యం, వెలుగులు చిందించే ప్రజసామ్యం, బహుళత్వం, ఓర్పు వీటిని భారత్ తప్పకుండా కొనసాగిస్తుంది.  భారత పౌరుల తరపున ఎవ్వరూ మాట్లాడాల్సిన పనిలేదు. ఉగ్రవాదం, ద్వేషపూరిత భావజాలాలికి భారతదేశంలో తావు లేదు. 

ఐక్యరాజ్యసమితిలో దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ప్రసంగంపై పాకిస్తాన్ ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేశాయి. కశ్మీర్ పరంగా ఎలాంటి మద్దతునూ కూడగట్టకుండా శూన్యహస్తాలతో స్వదేశానికి తిరిగి వచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి.

 

రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు