ఉన్నత దిశగా భారత-అమెరికా సంబంధాలు 

 భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి డా. ఎస్. జైశంకర్ ఇటీవల అమెరికా పర్యటించారు.  ఆ పర్యటన సమయంలో మాట్లాడుతూ భారత్, అమెరికాలు తమ వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోగలవని అన్నారు.  వాణిజ్య అంశాలకు సంబంధించి చూస్తే రెండు దేశాలు బహుముఖమైన, సమాంతరమైన వాస్తవ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొదట గమనించాల్సిన సత్యం ఏమిటంటే ఈ వివాదాలన్నీ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో ఉంటున్నాయి. ఇపుడు అవి మరింత కేంద్రబిందువుగా మారడానికి కారణం అమెరికా యంత్రాంగం కొన్ని నిబంధనలను కొన్ని అంశాలపై పెట్టడం. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ టారిప్ విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా కామర్స్ సెక్రటరీ విల్బర్ రోజ్ భానత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో కొద్ది వారాల్లో వాణిజ్య సంభాషణలను న్యూఢిల్లీలో జరపనున్నారు. అమెరికా ప్రధానంగా భారత డయిరీ మార్కెట్‌లోకి ప్రవేశించాలని కోరుకుంటోంది. అలాగే ధరల క్రమబద్ధీకరణలో వైద్య పరికరాలను తీసేయాలని కోరుతోంది. ఐసిటి టారిప్ ధరలు తగ్గించాలంటోంది. వీటికి ప్రతిగా జీరో-డ్యూటీ ప్రిఫరెన్షియల్ యుఎస్ వాణిజ్య కార్యక్రమం జిఎస్‌పి జాబితాలోకి భారత్‌ను తిరిగి అమెరికా చేర్చాలని మనదేశం ఆశిస్తోంది. 

అమెరికా విదేశాంగమంత్రి మైక్ పోంపెతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా. జైశంకర్ సమావేశ అనంతరం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని ప్రకటించారు.త్వరలోనే ఇరుదేశాల మధ్య ఒప్పందం సాధ్యపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అయితే చర్చలకు కొంత సమయం పడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎందుకంటే వాణిజ్య ఒప్పందాలు జరగడం అంటే అంత సులువైన వ్యవహారం కాదు. సింపుల్ అర్తెమెటిక్స్ కాదు. ఇందులో ఎన్నో రకాల అంశాలు మిళితమై ఉంటాయి. వాణిజ్య వివాదంతో పాటు, రెండు దేశాల విదేశాంగ మంత్రులు పలు అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. వాటిల్లో ఇండియా-భారత్ వ్యూహాత్మక సంబంధాలు, కశ్మీర్‌లో అభివృద్ధి, ఆందోళన రేపుతున్న పలు అంతర్జాతీయ అంశాలు కూడా ఉణ్నాయి. అంతేకాదు స్వేచ్ఛాయితమైన , బహిరంగమైన ఇండో-ఫసిఫిక్ ప్రాంత ‘విజన్’ దిశగా ముందుకు సాగడానికి పథకాలను కూడా రెండు దేశాల మంత్రులూ చర్చించారు. ఈ రెండు దేశాల మధ్య ఇది నాల్గవ సమావేశం. యుఎన్‌జిఎ సదస్సు నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన రెండు దేశాలను మరింత సన్నిహితం చేసింది. 

తన పర్యటనలో, భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి పలు అంతర్జాతీయ అంశాలపై భారత దృక్కోణాన్ని కూడా అమెరికాలో ఎంతోమంది మేథావులు, ప్రముఖ థింక్ ట్యాంక్స్ ముందర పెట్టారు. జైశంకర్ ఏడు ప్రముఖ థింక్ టాంక్స్ దేశాలలో పర్యటించారు. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి తన విజన్‌ని మరింత విస్తృతపరుచుకోవడంపై బాగా దృష్టిపెట్టినట్టు కూడా తెలిపారు. ప్రభుత్వాలు, అధికారుల స్థాయిని దాటి మరీ ఈ దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశాల సమయంలో జమ్ము-కశ్మీర్ అంశం కూడా చర్చకు వచ్చింది. భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఆర్టికల్ 370 వ అధికార ప్రకరణ రద్దును సమర్థించారు. కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత అంశమని చెప్పారు. కశ్మీర్ అభివృద్ధి సాధన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అవి కశ్మీర్ పరంగా ఎంతో ప్రాధమికమైన ప్రాధాన్య విషయం. భారత్ ప్రజలకు విషయాన్ని చెప్పడం ద్వారా ఆ నిర్ణయాలు దీర్ఘకాలంలో భారత్‌కు ఏవిధంగా సహకరిస్తాయో తెలిపారు. అవి వాస్తవరూపు దాల్చేవరకూ భారత్ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 

ఈ సందర్భంగా భారత విదేశాంగమంత్రి జైశంకర్ పాకిస్తాన్ సరిహద్దు తీవ్రవాదం గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అప్పుడే ఈ ప్రాంతంలో శాంతి సాధ్యం అవుతుంది. అమెరికా విదేశాంగమంత్రి  అమెరికా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. సమయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సభ్యురాలిగా ప్రవేశించడానికి భారత్ అన్ని విధాలా అర్హురాలు అని అమెరికా విదేశాంగ మంత్రి పోంపే అభిప్రాయపడ్డారు.  అంతేకాదు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ లేపోవడం వల్ల ఐక్యరాజ్యసమితి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. దీన్నే ఆయన మరింతగా వివరించారు. 21వ శతాబ్దంలో ప్రపంచం బహుముఖ ధృవ ప్రపంచంగా వృద్ధిచెందుతోంది. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ అంశాలు భారత్, అమెరికాలను మరింత చేరువ చేసాయి.  మరింత సంక్లిష్ట పరిస్థితులతో కూడిన శకంగా చెబుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ అత్యున్నత స్థాయిలో ఉంది. భారత్ రకరకాల ఆలోచనలను పంచుకుంటూ అంతర్జాతీయ కమ్యూనిటీ నుంచి మద్దతు కోరుతోంది. ముఖ్యంగా వాతావరణమార్పులు, ఉగ్రవాదం, కలుపుకుపోతూ సాగే అంతర్గత అభివృద్ధి అంశాలు వీటిల్లో ఉన్నాయి. 

వాషింగ్టన్ డిసిలోని ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ, భారత విదేశాం మంత్రి గాంధీజీ ఏదైనా సవాలును తీసుకుని పరిష్కరించండి అని అంటే అది తప్పకుండా వాతావరణ మార్పులపై పోరాటం చేయమనేదే ఉంటుంది అన్నారు. సమ్మిళితమైన విధానం ద్వారా, వాదనల ద్వారా భారత్ 175 జిడబ్ల్యు పునరుత్పత్తి ఎనర్జీని 2022 సంవత్సరానికి చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అసలు లక్ష్యం 2030 సంవత్సరం నాటికి దీన్ని 450 జిడబ్ల్యు పునరుత్తి ఎనర్జీని సాదించాలని ఉద్దేశం. వాతావరణ మార్పులపై పోరాటం చేయడమనేది పునరుత్పత్తి ఎనర్జీ, గ్రేటర్ ఎనర్జీ సామర్థ్య సాధన కన్నా చాలా పెద్దది. ఇది ప్రజల జీవినశైలిలో పెద్ద ఎత్తున ప్రక్షాళన తెస్తుంది. అది స్మార్ట్ సిటీస్ అవొచ్చు లేదా పెద్ద ఎత్తున ప్రజా బదిలీ అవొచ్చు, సుస్థిర వ్యవసాయం వినియోగం కావొచ్చు. నీటి వినియోగం  కావొచ్చు. 

రచన: డా. స్తుతి బెనర్జీ, అమెరికా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు