ఇండో-యుఎస్ ఎనర్జీ సంబంధాలు: గొప్ప పెరుగుదల దిశగా

భారత ప్రధాని నరేంద్ర మోది ఇటీవల అమెరికా సందర్శించిన విషయం తెలిసిందే. హూస్టన్‌కు వచ్చి ఎనర్జీ గురించి మాట్లాడకుండా ఉండడం అసాధ్యం అంటూ ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా హూస్టన్, టెక్సాస్‌లు ఎనర్జీ కీలక కేంద్రాలు. తన తొలి పలుకుల్లో మోదీ చాలా స్పష్టంగా ఇచ్చిన సందేశం అమెరికా-ఇండో సంబంధాలలో ఎనర్జీ సంబంధాలు కీలకమని వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఎనర్జీ సిఇవొలతో సమావేశానంతరం ప్రధాని నరేంద్రమోదీ ఈ ట్వీట్ చేశారు. తద్వారా ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెంపొందించాలని తలచారు. ఎంతో ఉత్తేజపూరితమైన ‘హౌడీ మోది’ ఈవెంట్ స్ఫూర్తితో మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఎంతో మూలస్తంభం ఎనర్జీ అని భావించారు.

 ఇరుదేశాల నాయకులు 2017లో సమావేశమైనప్పుడు భారత-అమెరికాల మధ్య వ్యూహాత్మక ఎనర్జీ భాగస్వామ్య ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘యాన్ అమెరికా ఫస్ట్ ఎనర్జీ ప్లాన్’ ఇప్పటి వరకూ శోధించని చమురు, సహజవాయువుల నిల్వల శోధన, ఉత్పత్తులను ఈ ప్లాన్ ద్వారా లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా న్యాయపరమైన, పెట్టుబడుల పరమైన అడ్డంకులను తొలగించాలని భావిస్తున్నారు. భారత వేగవంతమైన అభివృద్ధికి అత్యున్నత స్థాయి ఎనర్జీ వినియోగం కావాలి. అందుకే అది ప్రత్యామ్నాయ ఎనర్జీ వనరుల శోధనపై దృష్టిసారించింది. అలాగే వనరులపై  కొన్ని దేశాలపై ఆధారపడ్డాన్ని కూడా తగ్గించాలని భావిస్తోంది. భారత విధాన నిర్ణయాలు ప్రస్తుతం సహజవాయు ఆధారిత ఆర్థికరంగం దిశగా మళ్ళాయి. అంతేకాదు పారిస్ క్లైమేట్ ఛేంజ్ (సివొపి21) ఒప్పందం నిబద్ధత కూడా అదే. 

 భారత, అమెరికా దేశాలు భారీ స్థాయిలో ఎనర్జీ పరమైన అవసరాల లక్ష్యంగా ఉన్నాయి. భారత్ మధ్య ప్రాచ్యంపై ముడి దిగుమతుల పరంగా ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు గల్ఫేతర దేశాలతో ఎనర్జీ సంబంధాలపై దృష్టి నిలిపింది. భారత్‌కు అమెరికా అతి పెద్ద చమురు, సహజవాయువుల పంపిణీ అతి పెద్ద వనరుగాక ఎదుగుతోంది. 2017 నుంచి ముడిచమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుననాం. అది కేవలం రెండు సంవత్సరాల కాలంలో భారీగా పెరిగింది. సహజవాయువుకు సంబంధించిన తొలి షిప్‌మెంట్ భారత్‌కే వచ్చింది. అమెరికా నుంచి దిగుమతులు పెరగడం వల్ల వాణిజ్య లోటు అంతరం తగ్గుతుంది. ఎందుకంటే ఈ అంశాన్ని అమెరికా తరచూ భారత్ దగ్గర ఎత్తుతూ వస్తున్న విషయం తెలిసిందే. 

ఎనర్జీ విస్తృతంగా అందుబాటులో ఉండేలా, అలాగే ఎనర్జీ భద్రత, ఎనర్జీ సామర్థ్యం వంటివి గత ఏడాది జరిగిన రెండు దేశాల తొలి వ్యూహాత్మక ఎనర్జీ భాగస్వామ్యం సమావేశంలో కీలక అంశాలయ్యాయి. ఆ సమావేశంలో భారత పెట్రోలియం, సహజవాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అమెరికా సెక్రటరీ ఫర్ ఎనర్జీ రిక్ పెర్రీ పాల్గొని సహకారానికి సంబంధించి నాలుగు మూలస్తంభాలైన అంశాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అవి, ఒకటి చమురు, సహజవాయువు, రెండవది విద్యుత్, ఎనర్జీ సామర్థ్యం, మూడు పునరుత్పత్తి ఎనర్జీ మరియు సుస్థిర పెరుగుదల, నాలుగు బొగ్గు.

ప్రముఖ పరిణామం ఏమిటంటే భారత పెట్రోనెట్ ఎల్ఎన్‌జి లిమిటెడ్, అమెరికా స్థావరంగా ఉన్న టెల్లూరియన్ ఇన్క్ 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి. వాటిల్లో పెట్టుబడుల మొత్తం 2.5 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది పెట్రోనెట్ 18 శాతం వాటాను  డ్రిఫ్ట్‌వుడ్ ఎన్ఎన్‌జి ఎక్స్ పోర్టు టెర్మినల్‌లో ఉంది. సంవత్సరానికి పెట్రోనెట్‌కు ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ ఎన్ జి హక్కులు ఉంటాయి. అది ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు సమానంగా ఉండాలి. ఈ ఒప్పందం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరింది. ఇది అమెరికాలోని షేల్ గ్యాస్ రంగంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఒప్పందం అని ఛెప్పాలి. అంతేకాదు మరోవైపు నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియంలు కూడా ఈ ఒప్పందంలోకి ప్రవేశించాయి. తద్వారా అమెరికా ముడిచమురు పెట్టుబడిని సుస్థిర పరిమాణాల్లో పెంపొందించాలని ఉధ్దేశం. జిఎఐఎల్, రిలయన్స్ వంటివి అమెరికా గ్యాస్ ప్రాజక్టుల్లో పెట్టుబడులు పెట్టింది. ఇది చమురు రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఘానం, ఉత్పత్తుల్లో , అలాగే  భారతదేశంలోని సహజవాయువు రంగాలలో సాంకేతిక పరిజ్ఘాన మార్పిడితో లబ్దిపొందే అవకాశం ఉంది.

 భారత ప్రధానితో సంభాషణలు జరిపిన సందర్భంలో గ్లోబల్ ఎనర్జీ సిఇవొలు భారత ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెంచడంపై  మాట్లడారు. అలాగే స్వేచ్ఛయితమైన పెట్టుబడుల వాతావరణాన్ని వారు స్వాగతించారు. పైగా కార్పరొరేట్ టాక్స్ రేట్లలో తగ్గింపును సైతం వారు ఆహ్వానించారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఎ) స్పందిస్తూ, భారత విదేశీ ఎనర్జీ పెట్టుబడులు మోదీ పాలనలో 85 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరుగినట్టు పేర్కొంది. ఇది రికార్డు స్థాయిలో 12 శాతం పెరిగిందని వెల్లడించింది. అంతేకాదు ప్రపంచ మొత్తంలో అత్యున్నత పెరుగుదలగా పేర్కొంది. 300 బిలియన్ అమెరికన్ డాలర్లు  స్థాయిలో వచ్చే దశాబ్దానికి హైడ్రోకార్బన్ రంగంలో భారత్ పెట్టుబడి అవకాశాలు అందివ్వాలి.

ఇండో-యుఎస్ ఎనర్జీ రంగం కార్యక్రమాలలో ముఖ్యమైన సివిలియన్ న్యూక్లియర్ భాగస్వామ్యం, పవర్ గ్రిడ్స్ పెట్టుబడులు, పార్టనర్‌షిప్ టు అడ్వాన్స్ క్లీన్ ఎనర్జీ (పిఎసిఇ) కార్యక్రమం కింద ట్రాన్స్ మిషన్ లైన్స్ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. భారత-అమెరికా సంబంధాలు వృద్ధి దిశగా సాగుతున్నాయి. వచ్చే సంవత్సరాల్లో ఎనర్జీ సంబంధాలు  పెద్ద ఎత్తున పెరగడానికి వేదిక సంసిద్దంగా ఉంది.

రచన: సత్యజిత్ మొహంతి, ఐఆర్ఎస్, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు