జమ్ము కాశ్మీర్, లడక్ లకు ఓ నూతన ఉషోదయం

నిన్నటి వరకు మనకు తెలిసిన జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రం, కొన్ని చరిత్రలో జరిగిన  అనుకోని సంఘటనల పరిణామంగా పేర్కొనవచ్చు .పద్దెనిమిది వందల నలభై అరులో, బ్రిటిష్ వారికి ,డోగ్రా పాలకుడు మహారాజా గులాబ్ సింగుల మధ్య కుదిరిన అమృత్ సర్ ఒప్పందం మేరకు  దక్షిణ జమ్మూ ప్రాంతం, కాశ్మీరు లోయ కలవడం జరిగింది .లిటిల్ టిబెట్టు గా వ్యవహరించే బౌద్ధ వాతావరణం కలిగిన హిమాలయ పర్వత ప్రాంతాన్ని, జనరల్ జోరావర్ సింగ్  స్వాధీనం చేసుకోవటం దరిమిలా ఇది ఏర్పడింది..అలా ఏర్పడిన జమ్మూ కశ్మీర్ రాష్ట్ర మూడు విభిన్న ప్రాంతాలు, కొత్తగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా  ,రెండు వేల పందొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన రూపాం  తరమయినపుడు, భౌగోళికంగా పాక్షికంగా మార్పు  చోటు చేసుకుంది.

 

ఒక రాష్ట్రంలోని, అతి చిన్న ప్రాంతంగా ఉన్న లడక్ కేంద్ర పాలిత ప్రాంతంగా రూపాంతరం చెందటం అన్నది ప్రాంత ప్రజల దీర్ఘకాల ప్రార్థనల ఫలితంగా భావించవచ్చుపూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఎత్తైన హిమాలయ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని లడక్ వాసులు కనీసం అర్ధ శతాబ్ద కాలంగా కోరుతున్నారు .పందొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో లడక్ బౌద్ధ నాయకులలో ఒకరైన లామా లోబ్ జాన్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చటం ద్వారా నేరుగా కేంద్ర పాలనకు లడక్ వాసులు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని తెలియజేశారు . మార్పే  అభివృద్ధిలో ఉన్న ప్రాంత సమస్యలకు పరిష్కారం అని చాలామంది లడక్ వాసులు అభిప్రాయపడ్డారు .శ్రీనగర్ అధికార పగ్గాలు చేపట్టిన వారు ,జమ్మూ కాశ్మీర్ బ్యాక్ వాటర్ గా ,లడక్ను భావించారని వారి అభిప్రాయం . దీంతో  తమ విశిష్ట సాంస్కృతిక గుర్తింపును వ్యక్తీకరించడానికి ,పూర్తి ఆర్థిక సామర్థ్యాన్ని పొందడానికి కుదరలేదు .   

ఇప్పుడు లడక్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారడంతో  ప్రాంతాల్లోనూ, లెహ్ లోనూ ప్రజలు, కేంద్ర పాలిత ప్రాంత ఏర్పాటును   ఆనందోత్సాహాలతో స్వాగతించారు.  

 

మరోవైపు ,జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమ్మూ భాగమవడాన్ని జమ్మూ ప్రజలు ఒక చారిత్రక అవసరంగా స్వాగతించారు .వాస్తవానికి యాభై దశాబ్దంలోనే జమ్మూ రాష్ట్రాన్ని కేంద్రంతో  సమగ్ర పరిచేందుకు మొదటిసారిగా డిమాండ్    అంకురించింది .జమ్మూ స్థావరంగా ఉన్న ప్రజా పరిషత్తు పార్టీ  ఏక్ నిషాన్ ఏక్ ప్రధాన్ ఉద్యమం భావాన్నే వ్యక్తీకరించింది ..

 

అయితే జమ్మూ కాశ్మీర్ ని కొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్నిర్మించాలన్న నిర్ణయంపై, లోయలోని ప్రత్యేక తరగతిగా  వ్యవహారంలో ఉన్న చిన్న విభాగాల  వారు ఆగ్రహంగా ఉన్నారు .వారు ప్రత్యేక అవకాశాలను ,ఉన్నత స్థానాలకు సామీప్యతను, కోల్పోవటం ఆగ్రహానికి కారణమైంది .కాశ్మీర్ లోయ ఇప్పుడు   అభివృద్ధి నిధుల వినియోగాన్ని సక్రమంగా పొందగలుగుతుంది .భారీ స్థాయిలో ఉన్న పరిపాలనా పరమైన అవినీతి కూడా అంతమవుతుంది .మరీ ముఖ్యంగా స్థానిక రాజకీయ ప్రాబల్యం అనుభవిస్తున్న వేర్పాటు వాదుల  రక్షణ ముగిసింది . ఉగ్రవాద వ్యాప్తిని ఇకపై సమర్థవంతంగా అరికట్టవచ్చు. సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కు పిడికిలితో పోరు సలపాలి

 

భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ ను కేంద్రం అధీనంలోని రాష్ట్రంగా పూర్వ స్థితికి తీసుకు వచ్చేందుకు తాము సిద్ధమే అని కేంద్ర హోంమంత్రి అమిత్షా పునరుద్ఘాటించారు .ఇలా చెప్పడం ద్వారా, మార్పుల  ద్వారా  , కొందరు ఆరోపించినట్లు కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి  దూరం చేయటం తమ ఉద్దేశ్యం కాదని, లోయ ఎదుర్కొంటున్న కొన్ని భద్రతాపరమైన సవాళ్లను పరిష్కరించడమే  ప్రాధమికంగా తమ అభిమతమని కేంద్రం, నొక్కి చెప్పినట్లు అవుతుంది .

 

దీంతో ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని సూచన మాత్రంగా  తెలియజేసినట్లుగా ఉంది. కేంద్రం సూచన ఏమిటంటే మతపరమైనసీమాంతర ఉగ్రవాదాలు పెచ్చరిలడం వలన  ఎదురయ్యే సమస్యలు పరిష్కారమై, శాంతి సమానత్వాల పునరుద్ధరణ జరిగితే, జమ్మూ కశ్మీర్  రాష్ట్ర హోదా తిరిగి కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని .

 

రచన: ఎం.కె.టిక్కు,రాజకీయ వ్యాఖ్యాత