చాన్స్ లర్ మెర్కెల్ భారత్ పర్యటనతో సంబంధాల మెరుగుదల

జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ అయిదవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అధ్యక్షత వహించారు .జర్మనీతో స్థాయి భేటీకి ఎంపిక చేసిన దేశాలలో భారతదేశం ఒకటి .ఇది ఆమె జరిపిన నాల్గవ భారత పర్యటన .ఆమెతో పాటు పన్నెండు మంది మంత్రుల, ఒక పెద్ద వ్యాపార ప్రతినిధి బృందాలు ఉన్నాయి . ఆమె రాష్ట్రపతి  రామ్ నా థ్ కోవింద్ తో  సమావేశమయ్యారు .జర్మనీతో భారత్ కు బలమైన బంధాలు, వాణిజ్య సంబంధాలు ఉన్నాయని, సమతుల్యమైన యూరోపియన్ యూనియన్ భారత్ బ్రాడ్ బేస్డ్ అండ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం తిరిగి ప్రారంభించేందుకు, ముగించేందుకు యూరోపియన్ యూనియన్లో వనరులను సమీకరించడంలో  జర్మనీ మద్దతు ముఖ్యమని భారతదేశం భావిస్తున్నదని, రాష్టప్రతి అన్నారు. యూరోపియన్ యూనియన్లో భారత దేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మని .

ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభానికి న్యూఢిల్లీ సుముఖతను రాష్ట్రపతి ప్రకటన తెలియజేస్తోంది .బహుళ పక్షాల ,బహుళ ధ్రువ ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడానికి , ఉగ్రవాద నిరోధానికి సహకారాన్ని పరిపుష్టం చేయడానికి, కలిసి పనిచేయాలని, అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశాలలో తమతమ స్థానాలను సమన్వయం చేసుకోవాలని రాష్టప్రతి ఉద్ఘాటించారు .

 

అంతర ప్రభుత్వ భేటీ సందర్భంగా, భారత్ జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యం ,ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుతమైన సరసమైన వాణిజ్యం ..నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమం ..పరస్పర విశ్వాసం.. సాధారణ విలువల సూత్రాలపై ఆధారపడి ఉందని ప్రధానమంత్రి మోదీ ,చాన్సలర్ మెర్కెల్ పునరుద్ఘాటించారు. ఛాన్సలర్ మెర్కెల్ కేవలం ప్రతిభా శాలి అయిన స్నేహితురాలు మాత్రమే కాక, సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ప్రపంచ నాయకురాలు కూడా అని మోదీ అన్నారుతమ ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఇరు దేశాల స్నేహానికి ,సన్నిహిత సంబంధానికి నిదర్శనమన్నారు .రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఉమ్మడి చర్చల సమీక్ష అనంతరం, ఇరు దేశాల మధ్య, విభిన్న అంశాలునాలుగు విస్తృత శ్రేణులపైపదకొండు ఒప్పందాలు కుదిరి కుదిరాయి . ఇవి కృత్రిమ మేధస్సు డిజిటల్ రూపాంతరీకరణ లలో సహకార బలోపేతం,వాణిజ్య రంగాల్లోనూ పెట్టుబడుల అంశాల్లోనూ సరిహద్దుల విస్తరణ,సృజనాత్మకత, విజ్ఞానం, వాతావరణ  – సుస్థిర అభివృద్ధి కోసం ప్రజలను ఏకతాటిపై తీసుకురావటం వంటిచర్యలు,

 భౌగోళిక బాధ్యతను పంచుకోవటం

 

అంతర ప్రభుత్వ భేటీ ముగింపులో జారీ అయిన ఉమ్మడి ప్రకటన –  ఐదు అంశాలపై ఇరు దేశాల మధ్య సహకారం, భాగస్వామ్య రంగాలను వివరించే డెబ్బై మూడు అంశాలతో కూడిన విస్తృ తమైన పత్రం .ఆరోగ్యం ,మొబిలిటీ, పర్యావరణం వ్యవసాయ రంగాలలో సినర్జీ కనుకొనేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి .జర్మన్ ప్లాట్ ఫా రమ్ ఇండస్ట్రీలు 4.0, రానున్న సిఐఐ స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాట్ ఫారాల  మధ్య సహకారం, సమాచార మార్పిడి కోసం కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి .

 

వాణిజ్యంపెట్టుబడుల అంశాలలో ఇరువురు  నాయకులు, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ, డబ్ల్యు టీ లకు, తమ మద్దతు తెలిపారు .మేకిన్ ఇండియా మిటల్ స్టాండ్ ప్రోగ్రామ్, జర్మన్ ఇండియన్ స్టార్టప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలపై ప్రస్ఫుటంగా ప్రస్తావించారు. ..పునరుత్పాదక ఇంధనం ,నూతన సుస్థిర సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధికి ఇరువురు నాయకులు తమ మద్దతు తెలిపారు.భారత్ జర్మన్ ఆర్థిక మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారుల  సమావేశాన్ని తిరిగి ప్రారంభించారు  .సమాచార మార్పిడి, పరస్పర  ఆర్థిక ఆసక్తుల కోసం  ఇది ఒక వేదికగా వుంటుంది. .భారత్ లో అత్యంత వేగవంతమైన, సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, పౌర విమానయానం ,విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలు సమావేశ చర్చల్లో  ప్రముఖంగా చోటు చేసుకున్నాయి.

 

ఇరు పక్షాలకు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, పారిస్ ఒప్పందంవాతావరణ సమస్యలపై వారి సహకారానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఇంధన పరివర్తన అంశాల్లో ఇండో జర్మన్ ఎనర్జీ ఫోరం 2015,ఇండో జర్మన్ సౌర భాగస్వామ్యం 2013,  గ్రీన్ ఎనర్జీ కారిడార్లపై సహకారం ప్రస్ఫుటంగా పేర్కొనబడ్డాయి .ఇక ఇరు దేశాల ప్రజలతో ప్రజల  అంశాల్లో, ఉన్నత విద్య, ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ల లలో, భారత జర్మనీ భాగస్వామ్యంపై ప్రస్తావించారు .అలాగే ఇరు దేశాల్లో చదువుకుంటున్న  విద్యార్థుల సంఖ్య పెరగాలని కూడా ఆకాంక్షించారు

 

వ్యూహాత్మక భాగస్వామ్యం 2020 నాటికి, రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనున్న నేపధ్యం లోప్రతి యేడాది జరగవలసిన విదేశీ కార్యదర్శుల స్థాయి లో సంప్రదింపుల యంత్రాంగాన్ని సంస్థాగతీకరించాలని, ట్రాక్ 1.5  వ్యూహాత్మక సంభాషణని ప్రారంభించాలని, ప్రతి ఏటా రక్షణ మంత్రుల మధ్య సమావేశం జరగాలని నిర్ణయించారు ..ప్రపంచ ,ప్రాంతీయ, భద్రతా సవాళ్ళను సంయుక్తంగా పరిష్కరించేందుకూ, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు ఉపకరిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లో శాంతియుత అభివృద్ధి కి ,ఇరాన్ తో అణు ఒప్పందానికి పూర్తి మద్దతును   ఇరుపక్షాలు ఆమోదించాయిశాంతి,సుస్థిరత,శ్రేయస్సు లకు  పటిష్టమైన ,సమర్థవంతమైన, బహుళ పక్ష సహకారం ముఖ్యమని భారత దేశం, జర్మనీ పునరుద్ఘాటించాయి.

 

రచన: ప్రొఫెసర్.ఉమ్ము సల్మా బావా,జె ఎన్ యూ యూరోపియన్ అధ్యయనాల సంస్థ చైర్ పర్సన్ అండ్ జీన్ మొనెట్ చైర్.