ఎప్పటిలాగే ఉన్న పాకిస్థాన్ లోని రాజకీయాలు

కాశ్మీర్ సమస్య  అంతర్జాతీయ సమాజానికి ముగిసిన అధ్యాయమన్న వాస్తవాన్ని పాకిస్థాన్ అంగీకరించలేకపోతోంది .జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దయినప్పటి నుంచి అంశంపై అంతర్జాతీయ సమాజపు  దృష్టి పడేలా పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంది .అయితే భారత్ తన రాజ్యాంగ పరిధిలోనే వ్యవహరించిందని, మార్పులు తమ సార్వభౌమాధికార పరిధిలోనే ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్, ప్రపంచానికి విజయవంతంగా తెలియజేసింది .

 

ఇప్పుడు ఇస్లామాబాద్ ఒంటరై పోవడంతో, పాకిస్తాన్ రాజకీయ నాయకులు కాశ్మీర్ పైన, భారత ప్రభుత్వంపైనారాజకీయం చేస్తున్నారు. అంశాల్లో భారతదేశం పక్షాన  ఉండే దేశాల పై క్షిపణులతో దాడి చేస్తామని  కాశ్మీర్  గిల్గిత్ అండ్ బాలిస్తాన్ వ్యవహారాల పాకిస్తాన్ మంత్రి అలీ అమీన్ గండాపూర్ బెదిరించారు

 

కాశ్మీర్ అంశంపై భారత్ తో ఉద్రిక్తతలు పెరిగితే పాకిస్తాన్ బలవంతంగా యుద్ధానికి దిగుతుందని, కాశ్మీర్ సమస్యపై భారత దేశంతో నిలబడిన వారు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, స్థానిక పాకిస్తాన్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గండాపూర్ అన్నారు .కాశ్మీర్ అంశంపై భారత్ కు మద్దతు తెలిపే దేశాన్నైనా పాకిస్థాన్ శత్రు దేశంగా భావిస్తుందని అన్నారు. దేశంపై కూడా క్షిపణులతో  దాడికి పాల్పడతామన్నా రు .పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ కు గండాపూర్   అసలు సిసలు రాజకీయ వారసుడు .ఆయన విపరీతమైన వ్యాఖ్యలకు పేరొందినవాడు .

 

అటువంటి వ్యక్తులను  ఉన్నత కార్యాలయాలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి నామినేట్ చేయటం నిజంగా విడ్డూరంగా ఉంది. గండాపూర్, రషీద్ వంటి  నోటిదురద గల వారి వలన నయా పాకిస్తాన్ కల చిందర వందరగా ఉంది .

 

దేశీయంగా తలెత్తిన అనేక సంక్షోభాల కారణంగా పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉన్న విషయాన్ని గుర్తించిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, భారత వ్యతిరేక భావాలను సొమ్ము చేసుకోవాలని  ప్రయత్నిస్తోంది .గత మూడు నెలలుగా పాకిస్తాన్  సలుపుతున్న దౌత్య ప్రయత్నాలేవీ ఫలవంతం కాలేదు

 

కాశ్మీర్ అంశంపై ఇమ్రాన్ ఖాన్ వెనుకడుగులో ఉన్నారన్న విషయం స్పష్టమైంది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ కళ్ళతో చూ డదన్న  వాస్తవాన్ని పాకిస్తాన్ విశ్లేషకులు స్పష్టం చేశారు .జమ్మూ కశ్మీర్, లడక్  – రెండు కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశ అభివృద్ధి నమూనాగా  ప్రపంచ నాయకులు    స్వాగతించారు. ఇక ఇప్పుడు కాశ్మీర్ లోయ, జమ్ము ,లడక్ లలో అంతర్జాతీయ పెట్టుబడులు ముమ్మరం అయ్యే అవకాశం కూడా ఉంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం భారత్ అనేక అభివృద్ధి ప్రణాళికల రచన గావిస్తోంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు తమతమ ప్రాంతాల అభివృద్ధిలో వాటాదారులుగా ఉంటారు.

 

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అభివృద్ధి గురించి పాకిస్తాన్ కాశ్మీరీ వ్యవహారాల మంత్రి గండాపూర్ ని అడిగినప్పుడు ,అతను ప్రజల కోసం పోరాడితే సంతోషంగా ఉంటుంది అని అన్నారు .అటువంటి స్పందన వాస్తవానికి ప్రగతి నిరోధకమే.

 

ఒకవైపు పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ పై దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుండగాదేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు,   ఎన్నికల్లో రిగ్గింగ్ కి పాల్పడ్డారు అన్న ఆరోపణలపై  ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని, వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ,ఇస్లామాబాద్ లో సమా వేశమయ్యారు .రైట్ వింగ్ మత నాయకుడు, జమాయిత్ ఉలేమా ఇస్లాం ఫజల్ పార్టీ అధ్యక్షుడు  మౌలానా ఫజల్ ఉర్ రహమాన్  పిలుపు మేరకు  ఆందోళన కార్యక్రమం చోటుచేసుకుంది .

 

ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఆయననుడీసిల్ కుంభకోణాల్లో ఆయన పాత్రకుమౌలానా డీజిల్ అని మారుపేరు తో వ్యవహరించే వారు. ఫజల్ ఉర్ రెహమాన్, కరాచీ నుంచి నిర్వహించిన   నిరసన ప్రదర్శన కి నాయకత్వం వహించారు. ప్రభుత్వం తిరిగి అధికారాన్ని ప్రజలకే అప్పగించాల్సి ఉంటుంది అని గు జ్ర న్ వాలా లో మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మౌలానా అన్నారు 

 

గత ఏడాది వివాదాస్పద ఫెడరల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ తెహరీక్ ఇన్సాఫ్  – పీటీఐ కి ,వ్యతిరేకంగా పీపుల్స్ జేయు ఇఎఫ్ చేబట్టిన  నిరసనకు, దేశ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ,పిఎంఎల్ ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి .

 

అయితే ఖాన్ ప్రభుత్వం జేయు ఐఎఫ్ యువ వాలెంటరీ విభాగం అన్సార్  ఉల్ ఇస్లామ్ ని  ఉగ్రవాద సంస్థగా నిషేధించింది . దీన్ని సంస్థ కోర్టులో సవాలు చేసింది. నిరసనకారులు అనేకమంది ఇస్లామాబాద్ లో గుమికూడారు. పరిస్థితి చేజారిపోవచ్చు .

 

నిరసన ప్రదర్శనకు ఖాన్ ప్రభుత్వం ఆందోళన చెందాలని, పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకులు  సిరిల్ అల్మీదా అన్నారు .అనుభవం లేని పాకిస్తాన్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని శాంతియుతంగా తగ్గించ గలిగే సామర్ధ్యానికి ఇది ఒక పరీక్ష అన్నారు. ప్రభుత్వం బెదిరి, హింసకు కారణమయ్యేలా అతిగా ప్రవర్తించినా పరిస్థితి అదుపు తప్పుతుంది. .దురదృష్టవశాత్తు పాకిస్తాన్  విరుద్ధ స్వభావం ఇదే

 

రచన: కౌశిక్ రాయి ఆకాశవాణి వార్తా విశ్లేషకులు