తాష్కెంట్ లో జరిగిన ప్రభుత్వాధినేతల షాంఘై సహకార సంస్థ మండలి సమావేశం

ప్రభుత్వాధినేతల షాంఘై సహకార సంస్థ – ఎస్ సి ఓ 18 వ సమావేశంగత వారాంతంలో ఉజ్ బె కిస్తాన్ లోని తాష్కెంట్లో జరిగింది.

యురేషియా కేంద్రీకృత ఈ సంస్థలో, భారత్ 2017 లో చేరింది. ఇది  భారత్ పాల్గొన్న మూడవ ప్రభుత్వాధినేతల సమావేశం. 2017 నవంబర్ డిసెంబర్లలో, రష్యాలోని సోచిలో మొదటి సమావేశం జరిగింది. 2018  సమావేశం తజి కిస్తాన్లోని దు షన్బే లో  జరిగింది.

ఎస్సిఓకు భారత్, కజక్ స్తాన్, చైనా, కిర్గిస్తాన్, పాకిస్తాన్ , రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లు ఎనిమిది సభ్య దేశాలు. ఈ సంస్థకు నలుగురు పరిశీలకులు, ఆరుగురు సంభాషణ భాగస్వాములు ఉన్నారు. హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్  ఈ వేదికలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కాగా హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ ఈ సంస్థలో  రెండవ అతి ముఖ్య వేదిక. ప్రభుత్వాధినేతలు ఏటా సమావేశమవుతారు. వార్షిక బడ్జెట్ ఆమోదం, బహుళ పక్ష సహకారం, ప్రాధాన్యతా రంగాలపైని వ్యూహాల పై ఈ సమావేశం లో చర్చ జరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక, సహకార అంశాలపై కూడా ఈ సమావేశం పరిష్కారాలను సూచిస్తుంది. 

తాష్కెంట్లో జరిగిన ప్రభుత్వాధినేతల సమావేశానికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రతినిధిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలు అన్ని సభ్య దేశాలకు, ప్రపంచానికి కూడా ఆందోళన కలిగిస్తున్న అంశాలు. ఉగ్రవాదాన్ని ,ఉగ్రవాద సహాయకులను ఎదుర్కోవటానికి ఇప్పటికే ఉన్న అన్ని అంతర్జాతీయ చట్టాలు ,యంత్రాంగాలను బలోపేతం చేసి, అమలు చేయాలని, ఎస్సిఓ కు రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం మన సమాజాలకు విఘాతం కలిగిస్తుందని, మన అభివృద్ధి ప్రయత్నాలను బలహీన పరుస్తోందని, ఈ సవాలు ను ఎదుర్కోవడానికి ఎస్సిఓ  దేశాలన్నీ కలిసి రావటం చాలా ముఖ్యమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. వాతావరణ మార్పు, పేదరికం, అభివృద్ధిలేమి, అసమానతలను కూడా ప్రపంచం ఎదుర్కొంటోంది.

ఎస్సిఓ ప్రపంచ జనాభాలో సుమారు నలభై రెండు శాతానికిజిడిపిలో ఇరవై శాతానికి, భూభాగములో  ఇరవై రెండు శాతానికి ఎస్ సి ఓ ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ లోని స్నేహపూర్వక వ్యాపార వాతావరణం గురించి భారత రక్షణ మంత్రి  ప్రస్తావించారు. ఇటీవల కాలంలో భారత్ తన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ను గణనీయంగా మెరుగుపరిచింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద జాయింట్ వెంచర్స్ ద్వారా భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఎస్సీవో దేశాలను రక్షణ మంత్రి ఆహ్వానించారు.

ఎస్సీవోలో చైనా తరువాత భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ . రిసోర్స్ మ్యాపింగ్, వ్యవసాయ విద్య, ఉపగ్రహాల ప్రయోగం, ఔషధాలు, టెలీ మెడిసిన్, మెడికల్ టూరిజం, హాస్పిటాలిటీ, ఆర్థిక సేవల రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యాల అభివృద్ధికి, భారతదేశం తన అనుభవాన్ని పంచుకో గలదని రక్షణ మంత్రి అన్నారు.  ఎస్సీవో సభ్యదేశాల అభివృద్ధికి ప్రపంచీకరణ అపారమైన అవకాశాలను తెచ్చిందని ఆయన నొక్కి వక్కాణించారు.  అయితే ఇది అనేక సవాళ్లను కూడా సృష్టించింది. సభ్య దేశాల మధ్య సహకారం చాలా అవసరం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒంటరి తన, రక్షణ వాద ధోరణులు పెరుగుతున్నాయి. ఏకపక్ష వాదం, రక్షణ వాదాలు ఎవరికీ మేలు చేయలేదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థతో పారదర్శక నియమాల ఆధారిత, బహిరంగ, సమగ్ర, నిష్పాక్షిక, బహుళపక్ష, వాణిజ్య వ్యవస్థతో  ప్రజలకు సుస్థిర భవిష్యత్తుమంచి జీవితాన్ని అందించేందుకు వీలవుతుందన్నారు. ఇందుకు ఆర్థిక సహకారం పునాది అని ఆయన వక్కాణించారు .ఆర్థిక వృద్ధి ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించాలని మన విధానాల్లో అది కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన అన్నారు. 

ఎస్సిఓ దేశాలు ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ ప్రభావానికి గురవుతూ ఉంటాయి.  2019 సెప్టెంబర్లో, అమెరికా న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి క్లైమేట్ యాక్షన్ సదస్సు లో ప్రధానమంత్రి మోదీ, గ్లోబల్ కొయిలేషన్  ఫర్ డిజాస్టర్  రిసిలియన్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రకటించారు. స్థితిస్థాపక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దేశాల సామర్థ్యాల మెరుగుదలకు సహాయం చేయటమే ఈ కూటమి లక్ష్యం. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలో చేరాలని రాజ్నాథ్ సింగ్ ఎస్సిఓ సభ్య దేశాలను ఆహ్వానించారు. ఇది వాతావరణ మార్పుల అనుసరణకు తోడ్పడటంతోపాటు సెండాయ్ ఫ్రేమ్వర్క్ నిర్దేశించిన  రీతిలో   నష్టాలను తగ్గించే లక్ష్యాలను చేరుకునేందుకు దోహద పడుతుంది .

ఉజ్ బెకిస్తాన్ ప్రధాన మంత్రి అబ్దుల్లా నిగ్ మాటో విచ్ అరిపొవ్, ఎస్సీవో సభ్యదేశాల నాయకులు ప్రతినిధులు, ఎస్సీవో సెక్రెటరీ జనరల్ వ్లాదిమర్ నోరావ్, ప్రాంతీయ ఉగ్రవాద నిరోధక నిర్మాణం ఎగ్జికూటివ్ డైరెక్టర్ జమా కోన్ గియా సోవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 తాష్కెంట్ లోని శాస్త్రివీధిలో ఉన్న భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి రక్షణ మంత్రి నివాళి అర్పించారు. 1965  యుద్ధం తర్వాత భారతదేశం పాకిస్థాన్ ల మధ్య తాష్కెంట్ ఒప్పందం కుదిరిన ఒక రోజు తరువాత  1966   జనవరి 11 , నాటి ప్రధాన మంత్రి లాల్ బహ  దుర్ శాస్త్రి తాష్కెంట్లో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాలను కూడా రాజ్ నా థ్ సింగ్ సందర్శించారు. 

ఎస్సీవో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ తదుపరి సమావేశం 2020 లో భారత్ లో జరుగుతుంది. 

రచన: డా అథర్ జాఫర్, కేంద్ర ఆసియా అండ్ సీఎస్ వ్యూహాత్మక విశ్లేషకులు