ఆగ్నేయాసియాతో నిరంతరాయ భాగస్వామ్య నిర్మాణంలో భారత్.

భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం, ఇండో పసిఫిక్ దృక్పధాల అభివృద్ధికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సదస్సుల కోసం థాయ్ ల్యాండ్   సందర్శించారు. 16  భారత్ ఆసియాన్ సదస్సు,14   ఈస్ట్ ఆసియా సదస్సు, మూడవ ఆర్‌సిఇపి సదస్సులతో పాటు  వ్యూహాత్మక భాగస్వాములతో వరుస ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యారు. అంతకుముందు ఆగస్టులో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా సంబంధిత మంత్రివర్గ సమావేశాల్లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు.

16 వ భారత్ ఆసియాన్ సదస్సులో స్వేచ్ఛాయుతబహిరంగ, సంబంధిత నియమాల ఆధారిత, ఇండో పసిఫిక్   క్రమాన్ని పొందటంలో పరస్పర ప్రయోజనాలను ప్రధాని మోదీ వివరించారు. భారత్ లో ఆసియాన్ కేంద్రీకరణ, ఇండో పసిఫిక్ పట్ల ఆసియాన్   విధానం వంటి సాధారణ సూత్రాలను ఆయన నొక్కి వక్కాణించారు. సముద్ర సహకారం, భౌతిక డిజిటల్ కనెక్టవిటీ, బ్లూ ఎకానమీ, మానవతా సహాయం వంటి వాటికి పిలుపు ఇచ్చారు.వ్యవసాయం, శాస్త్ర విజ్ఞానం, పరిశోధన, ఐసిటి, ఇంజినీరింగ్ వంటి రంగాలలో సామర్థ్య పెంపుదల పై భారత్ దృష్టి సారించింది. ఆసియాన్  లో కనెక్టివిటీ ప్రాజెక్టుల కోసం భారత్ కు ఒక బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఉంది. ప్రాజెక్టుల గుర్తించి, నియంత్రణ రేఖ ను ఉపయోగించుకునే విధి విధానాల గురించి భారత్ చర్చిస్తోంది.  వాణిజ్య సమతుల్య  సమస్యల  పరిష్కారానికి ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్ టి ఏ   ని తిరిగి ప్రారంభించడానికి భారత్ ఆసియాన్ గతం లో  అంగీకరించాయి. 

తూర్పు ఆసియా సదస్సు – ఇఎఎస్ లో భారత ప్రధాని కూడా పాల్గొన్నారు.  ఇఎఎస్ వ్యవస్థాపక   సభ్య దేశంగా సముద్ర భద్రత, ఉగ్రవాదం వ్యాప్తి ని అరికట్టడం, అక్రమ వలసలు వంటి సాధారణ సమస్యలపై వ్యూహాత్మక సహకారాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రాంతీయ వేదికను బలోపేతం చేయడంలో భారత్ ఇతర సభ్యులతో కలిసి తన నిబద్ధతను ప్రదర్శించింది. 2018-2022   ఈఎఎస్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నం పెన్  తీర్మానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు, మనీలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి  అనుగుణంగా పురోగతిని, నాయకులు గుర్తించారు. అక్రమ మాదక ద్రవ్యాలు, బహుళజాతి నేరాలను ఎదుర్కోవడం ,సుస్థిరత కోసం భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవటం పై మూడు పత్రాలను ఇఏఈ  సదస్సు వద్ద  ఆమోదించారు.

ఈ ఏడాది ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ప్రధాన దృష్టి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఆర్‌సిఇపి  చర్చల  చుట్టూ తిరుగుతోంది. పదహారు దేశాల మెగా ఎస్పిజి ప్రపంచ జిడిపిలో ముప్పై రెండు శాతం ఉంటుందని అంచనా. 

 అయితే ఆర్ సిఇపి చర్చలు అనుకున్న విధంగా సాగలేదు.  భారత్ లేకుండా ఆర్‌సిఇపి ముగించడానికి లేదా ఆసియాన్ ప్లస్ మూడు ఫ్రేమ్ వర్క్ లో ఆర్సీఈపీ ని కొనసాగించడానికి వాటాదారులతో అది సంప్రదింపులకు దారితీసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో నిర్మాణాత్మక స్వేచ్ఛా వాణిజ్య ప్రోత్సాహానికి తన వంతుగా భారత్ వాదించింది .సేవా రంగాన్ని సరళీకృతం చేయాలని    స్థిరమైన వాణిజ్య లోటు సమస్యల పరిష్కారానికి  ప్రత్యేకంగా పిలుపు ఇచ్చింది. 

ఆర్‌సిఇపి సదస్సులో మిగిలిన పదిహేను సభ్యదేశాలు ఇరవై అధ్యాయాలను అన్ని మార్కెట్ సమస్యలను టెక్స్ట్ ఆధారిత చర్చలతో ముగించినట్లు ధ్రువీకరించిన ప్పటికీ పరిష్కారం కాని ప్రముఖ సమస్యలపై భారత్ దృష్టి పెట్టింది. మార్కెట్ లభ్యత ఎక్కువగా పొందటం, సుంకం కాక ఇతర అవరోధాలపై ఆందోళనలు, మొదటి లోని నియమాలను విస్మరించటం, ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి వాడుకలోని బేస్ ఇయర్ వంటి వాటిపై కొన్ని తేడాలున్నాయి. ఫెయిర్ నెస్, సమతుల్యత ఆధారంగా ఈ ఒప్పందాల్లో చేరకూడదని భారత్ నిర్ణయంతీసుకుంది. భారతీయుల జీవితాలపై, ప్రత్యేకించి సమాజంలోని బలహీన వర్గాల వారిపై పడే ప్రతికూల ప్రభావం తన నిర్ణయానికి దిశా నిర్దేశం చేసిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, మయన్మార్ లతో  తమ వ్యూహాత్మక ప్రయోజనాలను వివరించారు. ఆగ్నేయ, తూర్పు ఆసియాలో భారతదేశ బహుళ  డైమెన్షనల్ సంబంధాన్ని మరింత పెంచారు.

అనుసంధానత, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సహకారాన్ని పెంపొందించడానికి, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అధికారులు  సమావేశం అయ్యారు. ఉగ్రవాద నిరోధక, సైబర్, సముద్ర భద్రతలతో సహా భద్రతాపరమైన వివిధ  అంశాలపై చర్చ జరిగింది.

భారత్ యాక్ట్ ఈస్ట్ విధానంలో ఆగ్నేయాసియా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. 2018 లో భారత్ 69 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆగ్నేయాసియా దేశాల నుండి పది దేశాధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడంతో, ఆసియాన్ తో 25 సంవత్సరాల భారత్ బహుముఖ భాగస్వామ్యము ప్రదర్శితమయింది. ఆగ్నేయాసియాతో భారత్ వ్యూహాత్మక అనుబంధం మూడు సి లు – కామర్స్, కనెక్టివిటీ, కల్చర్. వాణిజ్యం, అనుసంధానతసంస్కృతులతో ముడిపడి ఉంది. ఆగ్నేయాసియాతో  వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్లే లక్ష్యంతో భారత్ ఆసియాన్ లో పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉంటుంది. 

రచన: డా. టిట్లి బసు, తూర్పు ఆగ్నేయాసియా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు.