ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యానికి దూరంగా ఉన్న భారత్ : దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం

జాతీయ ప్రయోజనాల పరిరక్షణ, ప్రోత్సాహాలకు, దేశాలు ఇతర దేశాలతో, ప్రాంతీయ సమూహాలతో సంబంధాలు ఏర్పరుచుకుంటాయి .ఏడు సంవత్సరాల క్రితం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య చర్చలు ఆరంభమైనప్పుడు తన లుక్ ఈస్ట్, తరువాతి యాక్ట్ ఈస్ట్ విధానాల దృష్ట్యా  భారత్ అందులో చురుగ్గా పాల్గొనడం సహజమే .ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య  (ఆర్‌సిఇపి) లక్ష్యం ఒక ఆధునిక, పరస్పర ప్రయోజనకర, ప్రాంతీయ బృందాన్ని నెలకొల్పటం 

.భారత్ ఏటికేడాది ఆర్‌సిఇపి నుంచి  అటువంటి ఫలితాల కోసమే ఒత్తిడి చేస్తోంది

తూర్పు ఆసియా దేశాలతో అనేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో విజయం  సాధించినప్పటికీ, ఆర్సీఈపీ చర్చల్లోకి ప్రవేశించాలని భారత్ నిర్ణయించింది .ఆసియాన్, జపాన్, కొరియాలతో భారత్ ఎఫ్ టి   ఒప్పందాల  తదనంతరం, వాణిజ్య లోటు రెట్టింపు కాసాగింది. ఎఫ్‌టీఏ భాగస్వాముల నుండి దిగుమతులు వేగవంతమయ్యాయి. అయితే మార్కెటింగ్ కి అనుకూలంగా లేని   సుంకాల అడ్డంకుల వలన భారత్ ఎఫ్‌టీఏ  వినియోగ రేట్లు ఒక మోస్తరుగా ఉన్నాయి. ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఒప్పందాల్లో నష్టాలను అధిగమించాలన్న భావనతో ఆసియాన్ తో, ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం మేరకు భారత్ తన సుంకాలను భారీగా తగ్గించింది.కొన్ని ఆసియాన్ సభ్య దేశాల అయిష్టత వలన వస్తువుల ఒప్పందంలో వాణిజ్యం సాగలేదు

వస్తువుల, సేవల చర్చల మధ్య అనుసంధానం కావాలని భారత ప్రధాని మోదీ ఆర్సీఈపీ సభ్యులను కోరారు. వస్తువుల చర్చలలో భారత్ కు నష్టాలకు ఆస్కారం లేకుండా ఉండగలిగే మార్గమిది .కొన్ని దేశాలు తమ సేవారంగాల  అందుబాటుకు అయిష్టతను ప్రదర్శించిఅదే సమయంలో వస్తువుల వ్యాపారం కోసం మార్కెట్ అందుబాటులో ఉండాలని భారత్ ని డిమాండ్ చేసాయి.

ఆర్సీ ఏపీ ముగింపు గడువును మళ్లీ మళ్లీ పొడిగించారు. చర్చలకు 2014  మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఎంఎఫ్ఎన్  డ్యూటీ రేట్లను అమలుచేయాలని   మొదట్లో  నిర్ణయించారు. అయితే 2020   లో ఆర్‌సిఇపి అమల్లోకి రానుండటంతో, ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించేలా, కస్టమ్స్ సుంకం కోతలకు ప్రాథమిక సంవత్సరాన్ని 2019  కి మార్చాలని భారత్ కోరింది. కానీ చాలా దేశాలు ఇందుకు అంగీకరించలేదు. సంవత్సరాల తరబడి చైనా నుంచి ఎగుమతులు భారత్ మార్కెట్లను ముంచెత్తి స్థానిక పరిశ్రమలకు పెను విఘాతంగా  మారాయి. దిగుమతుల పెరుగుదల నివారణకు అధిక సుంకాలు విధించేలా భారత్ ఆటో సేఫ్ గార్డ్  ట్రిగ్గర్  మెకానిజాన్ని కోరింది .భారత్ అతిపెద్ద దేశీయ మార్కెట్ పై దృష్టి నిగిడ్చిన దేశాలు దీనికి అంగీకరించలేదు .

సుంకాల దుర్వినియోగ నివారణకు గాను, భారత్  కఠిన నిబంధనల కోసం ఒత్తిడి తెచ్చింది. అయితే వస్తువుల్లో చాలావరకు కనీస అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి డ్యూటీ రహిత మార్కెట్లను పొందే అవకాశం ఉండటంతో రూల్స్ ఆఫ్ ఆరిజిన్ రూపకల్పన కష్టతరమైంది .అన్యాయమైన అంతర్జాతీయ వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా దేశీయ పరిశ్రమల రక్షణకు పటిష్టమైన విధానాలను కోరిన భారత్ ఆసియాన్ ఎఫ్‌టీఏ  కింద ఉల్లంఘన కేసులను నమోదు చేసింది. ఇది సక్రమమైన సరసమైన డిమాండ్ అయినా  ఆర్‌సిఇపి సభ్య దేశాలు అనేకం దీన్ని ప్రతిఘటించడంతో ఆమోదం పొందలేక పోయింది.

పెట్టుబడులు, కామర్స్ కి సంబంధించి, ఆర్సీఇ పీ  కూటమి కి చెందిన  సంపన్న దేశాలు ప్రవేశపెట్టిన ఇతర డబ్ల్యూటీఓ ప్లస్ నిబంధనలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై  పెను ప్రభావం కలిగించి ఉండేవి .సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి బదిలీ, పెట్టుబడుల అధ్యాయం కింద రాయల్టీ అవుట్ ఫ్లోను క్యాపింగ్ చేయటాన్ని నిషేధించే నిబంధనలు, కామర్స్ అధ్యాయం కింద డేటా స్థానికీకరణ నిషేధాన్ని అంగీకరిస్తే ,సానుకూల ఫలితాలు లభించి ఉండేవి కావు .

ఆర్సీఇపీ మంత్రివర్గ సమావేశాలలో, చర్చల్లో, భారత్ వాణిజ్యపరిశ్రమల మంత్రి, ఇతర సీనియర్ అధికారులు  ఆందోళనలను పలుసార్లు ప్రస్తావించారు. అయితే సమతుల ఫలితాలు లేనప్పుడు ఆర్సీఈపీ పై సంతకం చేయకూడదని భారత్ నిర్ణయించుకుంది. ముఖ్యంగా దేశీయ రంగపు చిన్న వ్యాపారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు నిర్ణయం తీసుకుంది .ఆర్‌సిఇపి దేశాలు న్యూఢిల్లీ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే తదనుగుణంగా పరస్పర సమస్యలు సంతృప్తికరంగా పరిష్కరించుకుంటే ఆర్సిఐపి  ఒప్పందాలలో సంతకం చేయడానికి భారత్  సుముఖం కావచ్చు. మేరకు ఆర్సీఈపీ పై భారత ప్రభుత్వం ఇతర నాయకుల ప్రకటన స్పష్టం గాఉంది.

రచన :సత్యజిత్  మొహంతి, ఐఆర్ఎస్ ,సీనియర్ ఆర్థిక విశ్లేషకులు