కాళాపానీ  వివాదం 

భారత్, నేపాల్, చైనా ఈ మూడు దేశాల ముక్కోణ కూడలి ప్రాంతం, కాళాపానీ…ప్రాంతం. హిమాలయ పర్వత శ్రేణుల ప్రాంతంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఫిథొరఘడ్ జిల్లాలోని ఈ ప్రాంతం నియంత్రణ విషయంలో భారత-నేపాల్ దేశాల మధ్య ఎంతో కాలంగా వివాదం ఉంది. ఆ వివాదం ప్పుడు మళ్ళీ మరో మారు తెరపైకి వచ్చింది. జమ్మూ కశ్మీర్  రాష్ట్రాన్ని పునర్వివ్యస్తీకరించిన నేపధ్యంలో భారత ప్రభుత్వం, కొద్ది రోజుల క్రితం సవరించిన ఇండియన్ మ్యాప్, దేశ పటాన్ని విడుదల చేసింది. సవరించిన దేశ పటంలో భారత భూభాగంగా చూపిన కాళాపానీ ప్రాంతంలోని కొంత భూభాగం, ఆ పరిసరాలలోని మరి కొంత భూభాగం తమదే అని నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

అయితే, ఈ వివాదం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చినా, నిజానికి ఇది ఇపాప్తి సమస్య కాదు. ఈ సమస్యకు చరిత్ర ఉంది. 1816లో నేపాల్ రాజు, అప్పటి బిటిష్ ఇండియా ప్రభుత్వం మధ్యకుదిరిన చారిత్రక  సంగౌలీ ఒప్పందం నాటినుంచి కూడా ఈ వివాదం సజీవంగా ఉంటూనే ఉంది. చర్చలు, సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఒప్పందమ ప్రకారం రెండు దేశాల మధ్య మహాకాళీ నది సరిహద్దుగా ఉంటుంది. అయితే, ఒప్పందంలో నది జన్మస్థలం, దాని ఉపనదులు వంటి కొన్ని విషయాల్లో స్పష్టత లేదు. ఆ  వివరాలను ఒప్పందంలో పొందుపరచ లేదు. అలా వివాదం మొదలైంది. అయితే, ఆ తర్వాతి కాలంలో, బ్రిటిష్ ఇండియా సర్వేయర్ జనరల్, కాళాపానీ, లిపు సరస్సు, లింపియధుర ప్రాంతం భారత భూభాగంలోని ప్రాంతాలుగా నిర్వచించారు. అయితే, మహాకాళీ నదీ జన్మ స్థలం ఆధారంగా ఈ ప్రాంతలపై తమ దేశానికి సార్వభౌమాధికారం ఉందని నేపాల్ వాదిస్తోంది. అలాగే, నేపాల్ పశ్చిమ భూభాగంలోని ధర్చులా జిల్లాలోని,  ఎటూ తేలని వివాదస్పద ప్రాంతంగా పేర్కొంటోంది. 

ఇదిలా ఉంటే, తాజాగా, భారత దేశం 2019 నవంబర్ 2వ తేదీన విడుదల చేసిన దేశ పటంలో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ, నేపాల్ రాజధాని ఖాట్మండులో చిల్లర మల్లర ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపధ్యంలో నేపాల్ విదేశాంగ శాఖ, కాళాపానీ ప్రాంతం తమ దేశ అంతర్భాగమని గట్టిగా విశ్వసిస్తున్నామని ప్రకటించింది. నేపాల్ విదేశాంగ శాఖ ప్రకటనకు స్పందనగా భారత విదేశాంగ శాఖ, భారత ప్రభుత్వం విడుదల చేసిన దేశ పటంలో చూపిన ప్రతి అంగుళం భూభాగం కూడా, భారత సార్వభౌమాధిక భూభాగంలో అంతర్భాగమని, నేపాల్’తో సరిహద్దులను మార్చలేదని స్పష్టం  చేసింది. 

భారత ప్రతిస్పందన నేపధ్యంగా, నేపాల్ ప్రధానమంత్రి KP శర్మ ఓలీ, ఈ విషయాన్ని చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో, సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వంతో దౌత్య పరంగా చర్చలు జరపాలని, చర్చల ద్వారా సాధ్యమైనంత తొందరగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఓలీ … నేపాల్ తన భూభాగంలో ఒక్క అంగుళం భాగాన్ని కూడా వదులుకోదని అంటూ ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కారాని నేపాల్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.  

భారత ప్రధామంత్రి నరేంద్ర మోడీ, 2015లో చైనాలో  పర్యటించిన సందర్భంగా, హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం మానససరోవర్’ కు దగ్గరి మార్గం నిర్మాణానికి భారత్, చైనా దేశాలు ఒప్పందానికి వచ్చిన సందర్భంలోనూ నేపాల్ ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తింది. నేపాల్ ఆ ప్రాంతం తమదంటుంది. అయితే, అప్పుడు, అక్కడ ఏమీ జరగలేదు. ఆ ప్రాంతంలో  భారత భద్రతా దళాల పర్యవేక్షణ కొనసాగుతోంది.  

భారత్, నేపాల్ దేశాలు ఉభయ  దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాల నేపధ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయి. భారత్, నేపాల్ దేశాలు రెండూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. అయితే, భారత ప్రభుత్వం, సరిహద్దు సమస్యలు అన్నిటికీ స్నేహపూర్వక పరిష్కారమ కనుగొనేందుకు ప్రస్తుత యంత్రాంగం సాగిస్తున్న ప్రయత్నాలను కొనసాగించాలని పేర్కొంది. అలాగే, ఇరుగు పొరుగు మిత్ర దేశాల మధ్య పొరపొచ్చాలు, విభేదాలు సృష్టించేందుకు స్వార్ధపర శక్తులు చేసే ప్రయత్నాల పట్ల  అప్రమత్తంగా ఉండాలని, భారత్ దేశం నేపాల్ ప్రభుత్వాన్ని కోరింది. 

దేశీయంగా వస్తున్న వత్తిళ్ళు, అతి జాతీయవాదం, నేపాల్ వ్యవహారాలో బయటి దేశాల ప్రయోజనాలు వంటి ఇతరేతర కారణాల వలన నేపాల్ ప్రభుత్వం, సరిహద్దు సమస్యలను సజీవంగా ఉంచుతోంది.అయితే, ఉభయ దేశాల నాయకత్వాలు, సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని గట్టిగా కోరుకుంటున్నాయి. కళాపానీ వివాదం విషయంలో కూడా ఉభయ దేశాల మధ్య ఇప్పటికే చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. భారత దేశంలో నేపాల్ రాయబారి, నిలంబెర్ ఆచార్య, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి, విజయ్ గోఖలేతో డిల్లీలో  కాళీపానీ విషయంగా చర్చలు జరిపారు. అలాగే ఈ సమస్యపై విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరపాలని నేపాల్ సూచించింది. అలాగే నేపాల్ ప్రభుత్వం ఇందుకు సంబందించిన చారిత్రిక సత్యాలను కనుగొనేందుకు నిపుణులతో ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది.  

ఉభయ దేశాల మధ్య, గత ఆగష్టు 5వ తేదీన ఖాట్మండ్’లో విదేశాంగ శాఖ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది.   ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలకు సంబందించిన అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. నిజానికి గత సంవత్సరం ఉభయ దేశాలు, పరస్పర సహకారానికి, రక్షౌల్ – ఖాట్మండ్’ రైల్వే లైను విద్యుదీకరణ, ఇంతవరకు ముట్టని, జలమార్గాల అభివృద్ధి, వ్యసాయం రంగాలను గుర్తించడంతో, ఉభయ దేశాల స్నేహ సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకున్నాయి. ఉభయ దేశాల మధ్య స్నేహమ దౌత్య సంబంధాలు చాలా చాలా పటిష్టంగా ఉన్నాయి. సందేహం లేదు. 

అయినా,  కాళాపానీ సమస్య భారత్, నేపాల్ దేశాలు రెంటికీ చాల సున్నిత సమస్య. అయితే, సరిహద్దుల సర్వే బృందాలు ఇప్పటికే సరిహద్దులను గుర్తించే పని ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో కాళాపానీ సమస్యతోపాటుగా, అన్ని సమస్యలు త్వరలోనే  స్నేహపూర్వకంగా పరిష్కారం అవుతాయి, అని ఆశించవచ్చును. 

రచన: రత్తన్ సలాడి, రాజకీయ విశ్లేషకులు