స్వీడ‌న్ రాజ‌దంప‌తుల భార‌త ప‌ర్య‌ట‌న‌

స్వీడ‌న్ రాజ దంప‌తులు రాజుకార్ల్ XVI గుస్తాఫ్ – రాణి సిల్వియా 5 రోజుల ప‌ర్య‌ట‌న‌కై భార‌త్ వ‌చ్చారు. స్వీడ‌న్ విదేశాంగ మంత్రి ఆన్‌వింటె, వ్యాపార మంత్రి ఇబ్ర‌హీంబేల‌న్ కూడా స్వీడ‌న్ రాజ‌దంప‌తుల వెంట ఉన్నారు. దాదాపు 50 స్వీడ‌న్ కంపెనీలు, అంకుర ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు కూడా ఉన్న‌త‌స్థాయి బృందంతో భార‌త్ కు వ‌చ్చారు. 1993, 2005 ప‌ర్య‌ట‌న‌ల త‌ర్వాత స్వీడ‌న్ రాజు భార‌త్ ను సంద‌ర్శించ‌టం ఇది మూడ‌వ‌సారి. 2015లో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్వీడ‌న్ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఇరుదేశాల న‌డుమ ఉన్న‌త‌స్థాయి రాజ‌కీయ అభిప్రాయ మార్పిడి జ‌ర‌గ‌టం నాల్గ‌వ‌సారి. గ‌త కొన్నేళ్లుగా జ‌రుగుతున్న ఉన్న‌త‌స్థాయి చ‌ర్చ‌ల వ‌ల్ల భారత్ – స్వీడ‌న్ బంధాలు బ‌ల‌ప‌డి ఎన్న‌డు లేని నూత‌న స్థాయికి చేరుకున్నాయి.

రాజు గుస్తాఫ్ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది క‌లుసుకున్నారు. వారిరువురు ఆవిష్క‌ర‌ణ విధానంపై భార‌త్ – స్వీడ‌న్ ఉన్న‌త‌స్థాయి విధాన సంభాష‌ణను ఆవిష్క‌రించారు. సంభాష‌ణ‌లో పాల్గొన్న వారంతా సుస్థిర వృద్ధి స‌వాళ్ళ‌ను ఎదుర్కోవ‌టానికి వాతావ‌ర‌ణ మార్పు ప్ర‌భావాన్ని త‌గ్గించ‌టానికి వీలుగా స‌ర‌స‌మైన‌,తూగ‌గ‌ల‌ టెక్నీజీల‌ను క‌నుగొన‌డంలో భ‌విష్య‌త్తు స‌హ‌కారానికి సంబంధించి అభిప్రాయాల‌ను ప‌ర‌స్ప‌రం పంచుకుని చ‌ర్చించారు. స్వీడ‌న్ రాజు రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్ ను కూడా క‌లిసారు. అటుపై ఇరుప‌క్షాలు 3 అవ‌గాహ‌న ఒప్పందాల‌పై సంత‌కాలు చేసాయి. స్వీడ‌న్‌కు చెందిన ఇంధ‌న సంస్థ – భార‌త శాస్త్ర సాంకేతిక శాఖ‌లు ప్రొటోకాల్ ఆఫ్ కో ఆప‌రేష‌ను పై సంత‌కాలు చేసాయి. అలాగే ధృవ‌శాస్త్రంలో స‌హ‌కారంపై స్వీడ‌ను విద్య‌, ప‌రిశోధ‌నా మంత్రిత్వ శాఖకు భార‌త భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ‌కు మ‌ధ్య మ‌రో MOU పై సంత‌కాలు జ‌రిగాయి. 

ఇక మూడ‌వ MOU స‌ముద్ర ప‌ర్యావ‌ర‌ణ భ‌ద్ర‌త వుండేలా చూసేందుకు సంబంధించిన‌ది ఇండో – స్వీడిష్ జాయింట్ నెట్‌వ‌ర్క్ గ్రాంటు అవార్డుల కింద కంప్యూట‌రు సైన్సు – మెటీరియ‌ల్ సైన్సు రంగాల‌లో భార‌త శాస్త్ర – సాంకేతిక శాఖ (డిఎస్‌టి), స్వీడ‌న్ ప‌రిశోధ‌నా మండ‌లి క‌లిసి 20 ద్వైపాక్షిక ప్రాజెక్టుల‌కు నిధులు స‌మ‌కూరుస్తాయి.

ఈ కార్య‌క్ర‌మానికి స్వీడ‌ను ప‌రిశోధ‌నా మండ‌లి రెండేళ్ళ పాటు 14 మిలియ‌న్ SEK నిధుల‌ను అంద‌జేస్తుంది. ఆవిస్క‌ర‌ణ‌లు – ఔత్సాహిక ప‌రిశ్ర‌మ‌ల ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు రెండు దేశాలు ప్ర‌క‌టించాయి. సీమాంత‌ర బృందాల నిర్మాణం ల‌క్ష్యంగా KTH రాయ‌ల్ టెక్నాల‌జీ సంస్థ ఐఐటి మద్రాసు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాయి. విదేశీ వ్యవ‌హారాల మంత్రి డా.ఎస్‌.జైశంక‌ర్ కూడా స్వీడ‌న్ రాజ‌దంప‌తుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ద్వైపాక్షిక సంబంధాల‌ను పెంపొందించ‌టంపై చ‌ర్చ‌లు జ‌రిపారు. కాగా 2020లో ఉమ్మ‌డి ప్ర‌తిపాద‌న‌ల కోసం స్మార్టు గ్రిడ్ ల రంగంలో భార‌త్ – స్వీడ‌న్ స‌హ‌కార పారిశ్రామిక ప‌రిశోధ‌న – అభివృద్ధి కార్య‌క్ర‌మాన్ని, డిజిట‌ల్ హెల్తు రంగంలో జాయింట్ కాల్ ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఇంకా స్వీడ‌న్ రాజు – భార‌త ప్ర‌భుత్వ ముఖ్య సైంటిఫిక్ స‌ల‌హాదారు ప్రొ.కె.విజ‌య రాఘ‌వ‌న్ ను క‌లిసారు. స‌ర్క్యుల‌ర్ ఎకాన‌మీ అప్రోచ్ ద్వారా ఉద్గారాలు, వాయుకాలుష్యాల ప‌రిష్కారంపై జ‌రిగిన సంభాష‌ణ‌ల సంద‌ర్భంగా ఈ స‌మావేశం చోటు చేసుకుంది. చివ‌ర‌గా స్టాక్ హోమ్ కు బ‌య‌లుదేర‌టానికి ముందు స్వీడ‌న్ రాజు – రాణి ఉత్త‌రాఖండ్ – ముంబ‌యిల‌ను సంద‌ర్శించారు. 

ఆర్థిక రంగం విష‌యానికి వ‌స్తే భార‌త్ – స్వీడ‌న్ కు 19వ అతిపెద్ద ఎగుమ‌తి మార్కెట్‌గా, చైనా, జ‌పాను త‌దుప‌రి 3వ అతి పెద్ద వాణిజ్య భాగ‌స్వామిగా ఉంది. 2009-10 లో 2 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం వృద్ధి చెంది 2014-15 నాటికి 2.4 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. అయితే 2018 నాటికి 5 బిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యాన్ని మాత్రం చేరుకోలేక‌పోయింది. స్వీడ‌న్ పెట్టుబ‌డులు పెర‌గ‌టాన్ని ఒక సానుకూల ప‌రిణామంగా ఈ సంద‌ర్భంగా చెప్పాలి. స్వాతంత్ర్యం రావ‌టానికి ముంద‌రే స్వీడ‌న్ కంపెనీలు భార‌త‌దేశానికి వ‌చ్చాయి. 1920ల నుండే ఎరిక్‌స‌న్ స్వీడిష్‌ మ్యాచ్ (WIMCO), SKF కంపెనీలు భార‌త్‌లో ఉన్నాయి. అట్లాస్ కాప్కో శాండ్‌విక్‌, అల్ఫాలావ‌ల్‌, ఓల్వో, ఆస్ట్రా జెనెక త‌దిత‌ర కంపెనీలు భార‌త్ లో త‌మ ఉనికిని చాటుకున్నాయి. అలాగే ఐటి కంపెనీలు స‌హా సుమారు 70 భార‌త కంపెనీలు ప్ర‌స్తుతం స్వీడ‌న్‌లో ప‌ని చేస్తున్నాయి.

భార‌త్ – స్వీడ‌న్ ఉభ‌యుల ప్ర‌జాస్వామ్య విలువ‌లు ఒకే విధంగా ఉన్నాయి. ఉభ‌య తార‌కంగా ఉండే రంగాల‌లో ముందుకు సాగాల‌నే నిబ‌ద్ధ‌త ఇరుదేశాల‌కు ఉంది. ప‌ర‌స్ప‌ర ఆస‌క్తి ప్ర‌యోజ‌నాలు, ఆధారంగా స్వీడ‌న్ – భార‌త్ ల మ‌ధ్య గ‌ట్టి బాంధ‌వ్యానికి అపార అవ‌కాశాలు ఉన్నాయ‌నే వాస్త‌వాన్ని కొట్టిపార‌వేయ‌లేము. గ‌త కొద్ది సంవ‌త్స‌రాల‌లో భార‌త్ – స్వీడ‌న్ దేశాల న‌డుమ ప‌ర‌స్ప‌ర ఆర్థిక‌, రాజ‌కీయ అవ‌గాహ‌న గ‌ణ‌నీయంగా పెరిగింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించి అంత‌రిక్ష సాంకేతిక ప‌రిజ్ఞానం, సామ‌ర్థ్య నిర్మాణం, సైబ‌ర్ భ‌ద్ర‌త, డిజిట‌ల్ స‌హ‌కారం, వాతావ‌ర‌ణ మార్పుల సంద‌ర్భంలో జీవ ఇంధ‌నాలు – మొద‌లైన నూత‌న రంగాల‌ను గుర్తించి స‌హ‌కారానికి బాట‌లు వేయ‌టం ప్ర‌స్తుతం అవ‌స‌రం. 

ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల భాగ‌స్వామ్యం, అవ‌గాహ‌న ఒప్పందాల చ‌ట్రం కింద ప్ర‌స్తుతం ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను స్వీడ‌న్ రాజ‌దంప‌తుల వంటి ఉన్న‌త‌స్థాయి వ్య‌క్తుల ప‌ర్య‌ట‌న‌లు మ‌రింత ప‌టుత‌రం చేస్తాయ‌నే సంకేతాల‌ను అంద‌జేస్తాయి.

 

ర‌చ‌న :  డా.సంఘ‌మిత్ర శ‌ర్మ‌, ఐరోపా వ్య‌వ‌హారాల‌పై విశ్లేష‌కులు