అమరికా అధ్యక్షుడు ట్రంప్భా రత పర్యటన ప్రాముఖ్యత 

ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి, అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించినా,ఆ పర్యటనను తక్కువగా అంచనావేయడం కుదరదు.అమెరికా అగ్రరాజ్యం కావం ఒక్కటే అందుకు కారణం కాదు. సంక్లిస్ట ప్రపంచ రాజాకీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా పోషించే పాత్ర చాలా కీలకమైనది.ఒక విధంగా, ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో అమెరికా నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. 

అమెరికా అధ్యక్షుని పర్యటన ఫలితాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చును, కానీ, అమెరికాతో సంబంధాలు, అమెరికాతో చర్చలను మాత్రం ఎవరూ కాదనరు,వద్దనరు. ఎవరూ సవాలు చేయరు.ఇక త్వరలో భారత దేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జరిపే పర్యటన విషయానికి వస్తే, ఈ పర్యటన ఉభయ  దేశాలకు కూడా ఎంతో కీలకం. అందుకు ఎంన్నో కారణాలున్నాయి. 

ప్రపంచ వ్యూహాత్మక సమతుల్యత చాలా వేగంగా అమెరికా వైపు  కదులుతోంది. అగ్ర రాజ్యం వైపు మొగ్గు చూపుతోంది. కొంతకాలం క్రితం వరకు వినవచ్చిన అమెరికా ప్రాబల్యం తగ్గి, చైనా ప్రాబల్యం పెరుగుతోందన్న ముచ్చట ఇప్పడు మరుగున పడిపోయింది. ఆ ప్రచారం ఆగిపోయింది. అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ చాలా చాల వివాదాలు చుట్టుకున్నా,ఆయన తమ స్థానాన్నితిరిగి పొందగలిగారు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని,అధికారాన్ని తిరిగి సాధించగలిగారు.ప్రపంచంలో అమెరికా ప్రాభావాన్ని చైనా సవాలు చేయలేక పోయింది. అమెరికా అంతటి శక్తివంతమైన దేశంతో సంబంధాలు నెరపడం అంతర్జాతీయ సమాజంలో ఏ దేశానికి అయినా అవసరం.

చైనా దక్షిణ/తూర్పు చైనా సముద్ర జలాలపై తమ దేశ ఆధిపత్యాన్ని విస్తరించడంలో అయితే ఏమి, సముద్ర మార్గంలో సుదూర ప్రాంతాల్లోకి  తమ దేశనౌక దళాలను కదిలించడంలో అయితే ఏమి, బెల్ట్ అండ్ రోడ్డు మార్గం గుండా దోపిడీ ఆర్థిక విధానాలను విస్తరించడం ద్వారా అయితే ఏమి, చైనా కొంతకాలం క్రితం వరకు దూకుడుకు ప్రదర్శించింది. చైనా దూకుడుకు  కళ్ళెం వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం గట్టి ప్రతీకార చర్యలు తీసుకుంది. ఆ విధంగా చైనాను కట్టడి చేసి, శాంతి యుత భాగస్వామిగా మలిఛి, సైనిక సామర్ద్య విన్యాసాలను కట్టిడి చేసే దేశంతో చేతులు కలపడం భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా అవసరం. అందుకే భారత దేశం అమెరికాతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవడం పట్ల ఆసక్తి చూపుతోంది.  

అంతేకాకుండా, అమెరికా – బహరత దేశాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఎదుర్కుని నిర్మించుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిర పరచుకునేదుకు నిరంతర ప్రయత్నం, నిరంతర పోషణ అవసరం. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధానమంత్రి నడుమ జరిగే శిఘరాగ్ర సమావేశం ఉభయ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక సహజ పరిణామం అనవచ్చును. ఉభయ దేశాల మధ్య గల సహజ సంబంధాలకు ప్రతీక. అదే విధంగా  ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మధ్యజరిగే 2 ప్లస్ 2 మంత్రిత్వ స్థాయి చర్చలు భారత అమెరికా వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. అయితే, ఉభయ దేశాల వ్యూహాత్మక సంబంధాలు మరింత సుస్థిరం, మరింత బలోపేతం కావాలంటే అత్యున్నత స్థాయి చర్చలే కీలకం అవుతాయి. ఉభయ దేశాల ప్రభుత్వాల అత్యున్నత స్థాయిలో తీసుకునే నిర్ణయాలు సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతాయి.

భారత్ – అమెరికా ఆర్థిక సంబంధాలు ఒడిదుకులను, కొన్ని సవాళ్ళను ఎదుర్కుంటున్నాయి. ఉభయ  దేశాల వాణిజ్య శాఖ అధికారులు బేదాభిప్రాయాలను తొలిగించేందుకు, సహకారాన్ని పెంచుకునేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. వాణిజ్య, పెట్టుబడులకు అద్యక్షుదు ట్రంప్ ఇచ్చిన ప్రాధాన్యత గతంలో మరే అధ్యక్షుడు ఇవ్వలేదు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విశేష అనుభవం ఉన్న ట్రంప్, తమ పూర్వ అధ్యక్షులు నడిచిన బాటలో కాకుండా భిన్నంమైన విదేశీ ఆర్థిక విధానాల బాటలో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థల నేపధ్యంలో భారత దేశం అమెరికాతో సొంత పంధాలో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుత ఆవసరాలను దృష్టిలో ఉంచుకుని అపోహలు  తొలిగించుకుని, ఉభయ తారకంగా, ఉభయులకు ప్రయోజనం చేకూర్చే విధంగా శిఖరాగ్ర స్థాయిలో ఒక అవగాహనకు వచ్చేందుకు ఉభయ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

శిఖరాగ్ర సదస్సు ఉభయ దేశాలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తాయి. అధ్యక్షుడు ట్రంప్ అంతగా ద్వైపాక్షిక  పర్యటనలు చేయలేదు. అలాంటిది, ఆయన భారత దేశంలో పర్యటించడం, శ్వేత సౌధం భారత దేశానికి ఇస్తున్న ప్రత్యేక ప్రాధాన్యత, గౌరవాలను ప్రతిబింబిస్తుంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వాషిగ్టన్ డీసీలో అధ్యక్షుడు ట్రంప్’తో  జరిపిన శిఘరాగ్ర సదస్సు, మోడీ విదేశాంగ విధానంలో ఒక విశేష అంశం. భారత ప్రధాన మంత్రికి మద్దతుగా హౌస్టన్ స్టేడియంలో నిర్వహించిన, “హౌడీ మోడీ” కార్యక్రమం అధ్యక్షుడు ట్రంప్’ ను విశేషంగా ఆకర్షించింది. భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న తీరు ఆయన్ని ఆకర్షించింది. అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా గుజరాత్ లోని మోటేర స్టేడియంలో మోడీ ఏర్పాటు చేసిన కార్యక్రమం, భారత దేశ  సౌందర్య సంపదను ప్రదర్శిస్తుంది, ఆర్థిక,ద్వైపాక్షిక కార్యక్రమాలతో పాటుగా ట్రంప్ పర్యటనలో ఇదొక ముఖ్య భాగంగా నిలిచి పోతుంది. 

దేశాల మధ్య దౌత్య, స్నేహ సంబంధాల పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నా, అతున్నత స్థాయిలో సంబంధాలే అంతిమ ఫలితాలను అందిస్తాయి. ఆవిధంగా చూసినప్పుడు ట్రంప్ భారత పర్యటనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.  

 రచన: ప్రొఫెసర్ . చింతామణి మహాపాత్ర ,Rector & Pro VC, JNU