చైనా పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్ CPEC : పాకిస్తాన్ కు రుణభారం

చైనా పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్- CPEC పూ  ర్తయితే అది బీజింగ్ కు నిస్సందేహంగా  గెలుపు-గెలుపు ఒప్పందంగా ఉండనుంది. చైనా భూభాగం కలిగిన పశ్చిమ జింజియాంగ్ ప్రావిన్స్ ను బలుచిస్తాన్ లోని గ్వాడార్  నౌకాశ్రయంతో కలిపి, చైనాకు గల్ఫ్,హిందు మహాసముద్రాలలోకి ప్రవేశం కల్పించనుంది ఈ  62 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు.

 

అయితే ఇది పాకిస్తాన్ ను ఎక్కడ ఖచ్చితంగా వదులుతుంది? ఈ ప్రాజెక్ట్ పై పాకిస్తాన్ లోని స్థానిక విమర్శకులతో సహా పలువురు విశ్లేషకులు కొంతకాలంగా అడుగుతున్న ప్రశ్న ఇది.  CPEC , దాని అనుబంధ ఇతర ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగి పోవడం,నిర్ణిత గడువు లోపు పూర్తి కాకుండా వెనకబడటాల్ని ఇక్కడ ప్రస్తావించడం తో సరిపోదు. వీటిలో మెగా హైడెల్ పవర్ ప్రాజెక్ట్,పెషావర్ ను కరాచీ తో కలిపే మరింత ప్రతిష్ఠాత్మకమైన రైల్వే లైను కూడా ఉన్నాయి. రైల్వే మార్గ ప్రారంభ అంచనా వ్యయం 8.2 బిలియన్ల అమెరికా డాలర్లు. తదనంతరం ఈ ఖర్చుని 6.2 బిలియన్ల అమెరికా డాలర్లకు తగ్గించారు.ప్రాజెక్ట్ వ్యయం లో 2 బిలియన్ డాలర్ల ఆదా, వేడుకలు జరుపుకోదగిన అంశమే.అయితే వాస్తవ వ్యయం 9 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చునని ఇప్పుడు నివేదికలు తెలియజేస్తున్నాయి.

 

CPEC పూర్తయితే ప్రతిష్ఠాత్మక బీజింగ్ belt and road initiative – BRI లో భాగం కాగలదు. దీని అంచనా వ్యయం దాదాపు ట్రిలియన్ డాలర్లు. చైనా దేశ భవిష్యత్తు ఆశల ఆశయాల అనుకూల రూపకల్పనే BRI. అయితే ఈ ప్రాజెక్ట్ లోని జూనియర్ భాగస్వాములకు  ఇది అంత ప్రత్యేకత గల ప్రోజెక్టు కాకపోవచ్చు. ఏమంటే BRI లో భాగమైన పాకిస్తాన్ తో సహా ఎనిమిది దేశాలు ఋణబాధ కు గురవుతున్నట్లు వాషింగ్టన్ స్థావరంగా ఉన్న సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ ఎత్తి చూపింది.

 

ఈ పరిస్థితికి కారణాలను వెదకడమేమంత అసాధ్యం కాదు.  శ్రీలంక,మాల్దీవులలాగానే, దక్షిణాసియా లోని రెండు పొరుగు దేశాలు చైనా తో  ఋణభారపు ఉచ్చులో పడటానికి చేరువయ్యాయి. అయితే ఈ అనుభవం కేవలం దక్షిణాసియాకే పరిమితం కాలేదు. అనేక ఆఫ్రికా దేశాలు చైనా ప్రాజెక్టులవలన భారీగా అప్పులలో కూరుకుపోయాయి.  చైనా  విదేశాంగ అభివృద్ధి తాత్విక విధానమే దీనికి కారణం.చైనా కు గ్రాంట్లు గాని,రాయితీ పై రుణాలను గాని ఇచ్చే అలవాటు లేదు. ప్రధానమైనవని భావించే ప్రాజెక్టులకు మాత్రం వాణిజ్యపరంగా ఋణాలిస్తుంది.  అయితే ఇవి పూర్తిగా వాణిజ్యపరమైనవా అన్నది ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. చైనా ఆర్థికసాయంతో చేబట్టిన శ్రీలంక లోని Mattala అంతర్జాతీయ విమానాశ్రయమే ఇందుకో ఉదాహరణ.  అత్యాధునికంగా అగుపడే ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని  వినియోగించే సందర్శకుల సంఖ్య అంతంత మాత్రమే.

 

అంతే కాదు. చైనా బిడ్డింగ్ ప్రక్రియ పారదర్శకంగా,అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఉండదు. చివరకు నికరంగా,చైనా కంపెనీలే లాభదాయకంగా నిలబడతాయి.CPEC దీనికి మినహాయింపేమి కాదు.చైనా తో ప్రతికూల వాణిజ్య సమతుల్యత కలిగి ఉండటం తో బాటు,తమ ఖాతాల నిర్వహణకు తగ్గ నగదు బెయిల్ ఔట్ కోసం పాకిస్తాన్  ఎక్కడెక్కడో సంప్రదించాల్సి వచ్చింది.  రుణాలను తీర్చేందుకు, పాకిస్తాన్  రుణాల కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి చుట్టూ తరుచూ తిరగవలసి వచ్చేది.

 

ఏది ఏమైనప్పటికి ఇస్లామాబాద్ ఋణభారాన్ని CPEC గణనీయంగా పెంచనుంది. ఈ రుణాన్ని తీర్చడానికి మరో నాలుగున్నర దశాబ్దాలు పట్టవచ్చునని భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలలో  తమకు అన్నివేళలా అందుతున్న ఆదుకునే మిత్రదేశపు మద్దతు కు బదులుగా తాము చెల్లిస్తున్న చిన్న మొత్తంగా  భావించి  ఈ ఋణభారాన్ని ఇస్లామాబాద్   అంతగా పట్టించుకున్నట్లు అగుపడదు.

భారత్ కోణం లో చూస్తే, Gwadar లో పెరుగుతున్న చైనా అస్తిత్వాన్ని ఆర్థికపరంగా అంచనా వేయరాదు.  హిందు మహాసముద్ర ప్రాంతం లో ఇతరత్రా తమ పాద ముద్రలను పెంచే  బీజింగ్ ప్రయత్నాలను మాల్దీవులు,శ్రీలంక,బంగ్లాదేశ్ లలో లా కాక, విడిగా చూడరాదు.  ఇవి తరుచూ చైనా దేశ  ‘ముత్యాల తంత్రి’ వ్యూహం లో భాగం గా కనబడతాయి.  మాములు మాటల్లో చెప్పాలంటే, దక్షిణాసియా ప్రాంతంలో భారత ప్రభావాన్ని ఎదుర్కొనే  ప్రయత్నంలో హిందు మహాసముద్రం లో తన అస్తిత్వాన్ని పెంచే బీజింగ్ ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు.  భారత్ తో  అంతంతమాత్రంగా   సంబంధాలున్న పాకిస్తాన్ చరిత్ర దృష్ట్యా,  పెరిగిపోతున్న  CPEC రుణభారం గురించి ఇస్లామాబాద్ ఫిర్యాదు చేయకపోవడానికి, ఇదే కారణమని  తేటతెల్లమవుతోంది.

 

రచన: ఎం.కె.టిక్కు,రాజకీయ వ్యాఖ్యాత