విదేశాంగ విధానంతో వాణిజ్యాన్ని సమన్వయం చేసిన భారత్

నరేంద్రమోడీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి, NDA ప్రభుత్వం, విదేశాంగ విధానం లో బిజినెస్ టు బిజినెస్,B2B పై దృష్టి నిగిడ్చింది. వాటిలో భాగస్వామి దేశాలకు తక్కువ వడ్డీతో దశాలవారి రుణ సదుపాయం లైన్ ఆఫ్ క్రెడిట్ ను విస్తరించడం గమనార్హం. వందల సంఖ్యలో ఉన్న అవి గత కొన్ని సంవత్సరాలుగా స్థాయి,సంక్లిష్టత,వైవిద్యాలలో పెరిగాయి. వాటి పరిధి విదేశాలలో ప్రాజెక్టుల అమలు నుంచి సేవలవిస్తరణ,ఉత్పత్తుల సరఫరా వరకు ఉంది. విదేశాంగమంత్రి డా.జైశంకర్ ఒక వాణిజ్యసదస్సులో భారత్ వ్యాపారాత్మక దౌత్యవిధానాన్ని ప్రస్ఫూటం గా వివరించారు.

ఏ  లైన్ ఆఫ్ క్రెడిట్ లో నైనా 65% నుండి 75% వరకు భారత్ కు చెందిన  అంశం ఉండటమన్నది  లైన్ ఆఫ్ క్రెడిట్ ల సామాన్య లక్షణం. ప్రతి ఒక్కటీ తమదైన శైలిలో భారత్ కంపెనీలకు విదేశాలలో మార్కెటింగ్ ను సమకూరుస్తుంది. సార్వభౌమ హామీ కలిగిఉండటంతో క్రెడిట్ లైన్లు,భారత్ కంపెనీల కార్యకలాపాలు సాగడానికి దోహదపడతాయి.  లేకుంటే సాధారణంగా  ఎదురయ్యే ఇక్కట్ల దృష్ట్యా   భారత్ కంపెనీలు ఈ సాహసానికి పూనుకోవు.

ఇప్పటివరకు 64 దేశాలలోని 539 ప్రాజెక్టులకు భారత్ 300 దశలవారి రుణ సౌకర్యాలను  అందించింది. క్రెడిట్ లైన్ల పరిమాణం, ప్రోజెక్టుల ప్రొఫైల్ దృష్ట్యా ఈ చర్యలు ఇటీవలి కాలం లో గుణాత్మకంగా విస్తరించాయి. ప్రభుత్వ  అత్యంత సమగ్ర  దృక్పధం, దృఢ పర్యవేక్షణ కారణంగా  వాటి ప్రణాళిక,ఆచరణలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. అవసరమైతే ప్రధానమంత్రి    ప్రమేయానికి కూడా అవకాశం ఉంది. ఫలితంగా గత కొన్నేళ్లలో ఏడాదికి రెండు కంటే ఎక్కువగా పెద్ద ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి.ఇక మన పొరుగున క్షేత్రస్థాయిలో ముద్ర వేయగల హెచ్చు ప్రభావశీల అభివృద్ధి ప్రాజెక్టుల విషయానికి వస్తే,నాలుగు వారాలకు ఒక ప్రాజెక్ట్ చొప్పున భారత్ పూర్తి చేస్తోంది. ఇదేమి సాధారణ విజయం కాదు.

క్రెడిట్ లైన్లు, ప్రాజెక్టులలో ఎక్కువ భాగం ఆఫ్రికా తోనే ఉన్నాయి.  అక్కడ అవకాశాల దృష్ట్యా ఆ  ఖండంతో మన ప్రభుత్వం  మన దేశ అభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంపొందిస్తోంది. 205 క్రెడిట్ లైన్లతో సహా 321 ప్రోజెక్టుల కార్యకలాపాలు అక్కడ కొనసాగుతున్నాయి.కాగా ఆసియా లో 181,లాటిన్ అమెరికా, కరీబియన్ లలో 32, మధ్య ఆసియా, ఓషియానియా లలో మూడేసి  ప్రాజెక్టులు ఉన్నాయి .క్రెడిట్ లైన్లతో పోల్చితే గ్రాంట్ల సాయం వితరణ మరింతగా కరీబియన్ నుంచి పసిఫిక్   దీవుల వరకు విస్తరించింది.  ఈ అభివృద్ధిపర భాగస్వామ్యాలు నేడు భారత దౌత్య పాద ముద్రల్ని  భౌగోళికరించేందుకు దోహదపడుతున్నాయని డా.జయ్ శంకర్ అన్నారు.

విద్యుత్ రంగంలో ఫలవంతమైన సుధీర్ఘ చరిత్రగల భూటాన్ తోటి మన సంబంధాలలో అభివృద్ధి భాగస్వామ్యాలు అత్యంత గణనీయమైనవి.  బంగ్లాదేశ్ లోని కీలకమైన రైలు వంతెనలు,  శ్రీలంకలో పునర్ నిర్మాణం లో ఉన్న రైల్వే ట్రాకులు, నేపాల్   లోని రోడ్డు ప్రాజెక్టులు,విద్యుత్ లైన్లు, మారిషస్ లోని మెట్రో ఎక్స్ప్రెస్, క్రెడిట్ లైన్ల క్రింద మన పొరుగు దేశాలలోని ఇతర ప్రతిష్టాత్మక దిగ్గజ ప్రాజెక్టులు. 

సుడాన్,ర్వాండా,జింబాబ్వే,మాలావి లలోని విద్యుత్ ప్రాజెక్టులు, మొజాంబిక్, టాంజానియా,గునియ లలో జల ప్రాజెక్టులు, Cote d’Ivorie,guinea, zambia లలో  ఆరోగ్యం,Ethiopia,ghana,లలో చక్కెర,Djibouti,Republic of Congo లలో సిమెంటు,Gambia, Burundi లలో ప్రభుత్వ భవనాల ప్రాజెక్టులు మన దశలవారీ రుణ సాయం క్రింద ఆఫ్రికా లో రూపుదిద్దుకుంటున్న ప్రముఖ ప్రాజెక్టులని మన విదేశాంగ మంత్రి  అన్నారు. వాస్తవానికి అనేక ఆఫ్రికన్ దేశాలలోని భారతీయ కంపెనీలు నెలకొల్పిన కొన్ని తయారిపరిశ్రమలు  ఆ రంగంలో మొట్ట మొదటివి. మన ఆర్ధిక సామర్ధ్యానికి, మన దేశ బ్రాండ్ కు అవి తార్కాణాలు. అటువంటి భౌగోళిక పరిస్థితులు నెలకొన్న దేశాలలో మరింత దూకుడుగా వ్యాపారం చేసేందుకు  మన కంపెనీలకు అవి పునాదులు. ఫలితంగా మనం గడచిన అయిదు సంవత్సరాలలో ఆఫ్రికన్ దేశాలకు ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల మేర కొనుగోలుదారుల రుణాన్ని అందించాము.

దశలవారీ ఋణాలతో బాటు భారత్ చేబట్టిన ప్రాజెక్టులకు ఆయాదేశాలకు న్యూఢిల్లి గ్రాంట్లు కూడా అందించింది. Mauritius, Seychelles లను కూడా చేర్చితే  మన పొరుగు దేశాలకు గ్రాంట్లు అందించిన ప్రాజెక్టుల సంఖ్య 272 కావడం లో ఆశ్చర్యమేమి లేదు.

ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనం,సల్మా డామ్,  శ్రీలంకలోని తమిళులకు గృహనిర్మాణ ప్రాజెక్టులు, మయాన్మార్ లో సుప్రీమ్ కోర్టు, నేపాల్ తో బిరాట్నగర్  ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు  మన iconic grant project లని డా.జయ్ శంకర్ అన్నారు. ప్రపంచానికి బ్రాండ్ ఇండియా లో అనేక  పార్శ్వాలున్నాయి. అయితే అతి ముఖ్యమైనవాటిలో బిజినెస్ ఇండియా ఒకటి

 

రచన: కౌశిక్ రాయ్,ఆకాశవాణి వార్తా విశ్లేషకులు