మార్చి నెల మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ లో గణనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.యుద్ధ ప్రభావిత దేశం లో అత్యావశ్యకమైన శాంతి పున రుద్ధరణ వేగవంతమయేలా సులభతర ఆఫ్ఘన్ అంతర చర్చల ప్రక్రియకు ఫిబ్రవరి 29 న అమెరికా తాలిబన్ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ సమాజం లోని తీవ్రవాద ప్రతినిధులతో చర్చలకు ఆ దేశ శాంతి కాముకుల పక్షాన ఆఫ్ఘన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం సంఘటితమౌతుందని భావించారు .
అయితే ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటన తదనంతరం ఇపుడు అక్కడి లోతైన విభజనలు అగుపడుతున్నాయి. ప్రస్తుతం కాబుల్ లో నెలకొన్న రాజకీయ గొడవల నేపధ్యం, సామరస్య పరిష్కారాన్ని ఆశిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలలోనే కాక బాహ్య శక్తులకూ నిరాశ కలిగిస్తోంది.
గత ఏడాది చివర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అష్రఫ్ ఘనీ ని విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే అబ్దుల్లా అబ్దుల్లా నేతృత్వం లోని ప్రభుత్వం లోని మరో శక్తివంతమైన వర్గం, అధికారిక ప్రకటన ద్వారా తెలుపబడిన ఆష్రఫ్ ఘనీ విజయానికి పోటీ పడింది. ఆయనను రెండవసారి అధ్యక్షునిగా అంగీకరించలేని డా.అబ్దుల్లా అబ్దుల్లా అదే క్షణాన తదుపరి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబూల్ లో ప్రస్తుత పాలనా వ్యవస్థ ను ఇబ్బందికి గురి చేయడమే కాక, పాకిస్తాన్ మద్దతు ఉన్న తాలిబన్ తో చర్చలు జరుపనున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఈ చర్య ప్రశ్న గుర్తుగా మారింది.
ఆఫ్ఘన్ ప్రభుత్వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. అబ్దుల్లా అబ్దుల్లా కు ఆఫ్ఘన్ ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సర్దుబాటు చర్య గా అధికార విభజన సూత్రాన్ని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాద ఎజండా తో ఉన్న తాలిబన్ నాయకులను ఎదుర్కోడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం లోని రెండు శక్తివంతమైన వర్గాలు కలిసి రాకుంటే ఆఫ్ఘన్ భవితవ్యం నిస్సారంగా కొనసాగాల్సి ఉంటుంది.
మార్చి 10 నుండి ప్రారంభం కావాల్సిన ఆఫ్ఘన్ అంతర చర్చలను ఆఫ్ఘన్ అగ్ర నాయకుల మధ్య గల విభేదాలు దెబ్బతీస్తాయి. కాబూల్ లోని ప్రజాస్వామ్య ప్రభుత్వం కలిసికట్టుగా బలంగా ప్రవ ర్తించ వలసిన తరుణం లో వారి మధ్య గల తీవ్ర విభేదాలు దేశ పాలన కొనసాగింపును బలహీనపరుస్తాయి. తమ ప్రభుత్వాన్ని నడిపేందుకు, తమ సొంత ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించిన తరువాతనే ఆఫ్ఘన్ ప్రభుత్వం నెలకొల్ప బడింది. ఆఫ్ఘన్ ప్రజలు,ముఖ్యంగా మహిళలు, గత రెండు దశా బ్దాలలో ఇతర స్వేచ్చా సమాజాల వలే స్వేచ్ఛను రుచి చూసారు.
2001 లో జరిగిన నవంబర్ 9 ఉగ్రదాడి తరువాత ఉగ్రవాద తాలిబన్ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అయినా పాకిస్తాన్ మద్దతు తో వృద్ధి చెందుతూనే ఉంది.
గత రెండు దశాబ్దాలుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కాబుల్ లో మోహరించిన అమెరికా బలగాలతో తాలిబన్లు తలబడుతూనే ఉన్నారు.
ఫిబ్రవరి 29 అమెరికా తాలిబన్ ఒప్పందం తరువాత కూడా, శాంతి చర్చల ప్రక్రియ లో తాలిబన్ అవరోధాలు కల్పిస్తూనే ఉంది. ఈ ఒప్పందం కుదిరిన ఒక రోజు తరువాతే,ఉగ్రవాదం తో సహా వివిధ నేరాలతో కారాగార శిక్ష అనుభవిస్తున్న అయిదు వేలమందిని విడుదల చేయాలని తాలిబన్ కోరింది. దీన్ని ఘనీ ప్రభుత్వం సహజంగానే తిరస్కరించింది. ఆఫ్ఘన్ అంతర చర్చల పురోగతితో ఈ డిమాండ్ ముడిపడి ఉండాలని కాబుల్ కోరింది.
గత రెండు దశబ్దాలలో ఆఫ్ఘన్ దేశ,సమాజ పునర్నిర్మాణం లో భారత్ గణనీయ పాత్ర పోషించింది. ఆఫ్ఘన్ కి చెందిన,ఆఫ్ఘన్ యాజమాన్యం లోని, శాంతి సుస్థిరతలు నెలగొల్పే ఎటువంటి ప్రక్రియకైనా, న్యూ ఢిల్లీ ఎల్లపుడు తమ నిబద్ధతను తెలియజేస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొనిఉన్న ప్రతిష్టంభన పై స్పందనగా,శాంతిని ఆకాంక్షిస్తున్న ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను భారత్ స్పష్టీకరించింది. ఆఫ్ఘనిస్తాన్ సమాజం లోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేలా, శాంతియుత,ప్రజాస్వామిక ,ఉజ్వల భవిష్యత్తు ని ఆకాంక్షించే ఆఫ్ఘన్ ప్రభుత్వానికి,ప్రజలకు,సాధ్యమైన తమ మద్దతు కొనసాగుతుందని, ఆఫ్ఘన్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. 90 దశకం ప్రారంభం లో సోవియట్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగిన దరిమిలా, విధ్వంసం చోటు చేసుకున్న ఈ దేశ పునర్నిర్మాణానికి గత 18 సంవత్సరాలలో భారత్ 3 బిలియన్ డాలర్లకి పైగా పెట్టుబడి పెట్టింది. తమదేశ నిర్మాణం లోని భారత్ పాత్రకు ఆఫ్ఘన్ ప్రజలు భారత్ ను ప్రేమిస్తారు
రచన : రంజిత్ కుమార్,సీనియర్ పాత్రికేయులు