తమ భూభాగం నుండి కార్య కలాపాలు సాగిస్తున్న ఉగ్రబృందాల తో పాకిస్తాన్ వ్యవహరించే తీరు అందరకు తెలిసిందే. భౌగోళిక ఉగ్రవాది మసూద్ అజార్ పై పారిస్ లో అంతర్జాతీయ ఆర్ధిక కార్యాచరణ సంస్థ FATF ప్లీనరీ ఎదుట ఆ దేశం పచ్చి అబద్ధాలు చెప్పడం తో ఆ ద్వంద్వ వైఖరి మరో సారి బహిర్గతమైంది. అధికారిక రక్షణ లో ఈ ఉగ్రవాద సూత్రధారి పాకిస్తాన్ లో తల దాచుకుంటున్నాడు. ఉగ్రవాద బృందాలపై తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రపంచానికి చూపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే వాస్తవం లో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడులకు కారకులైన మసూద్ అజార్,హఫీజ్ మహమ్మద్ సయీద్,జాకీర్ ఉర్ రహ్మాన్ లఖ్వీ తదితర అనేక మంది ఉగ్రవాదుల పై విచారణ చేబట్టడం,సరైన జరిమానా విధించడాలు చేబట్టలేదు.
2019 ఫిబ్రవరి 14 న 40 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ సిబ్బందిని జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడిలో హతమార్చినట్లు ప్రకటించుకున్న జైషే మహమ్మద్ JEM దళ అధిపతి మసూద్ అజర్. 2019 ఫిబ్రవరి 26 న వైమానిక మెరుపు దాడి సలిపి బాలా కోట్ ప్రధాన కేంద్రాన్ని,జైషే మహమ్మద్ శిక్షణా స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అప్పటి నుండి మసూద్ అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించవలసిన ఒత్తిడి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పై అధికం కాసాగింది. అమెరికా,ఇంగ్లాండ్,ఫ్రాన్స్ లు సంయుక్తంగా ఇందుకు సుముఖంగా ఉన్నా,పాకిస్తాన్,చైనాలు అవరోధంగా మారాయి. ఎట్టకేలకు 2019 మే 1 న మసూద్ ని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించారు. అయినా పాకిస్తాన్ అతన్ని బహిరంగంగానో, రహస్యం గానో కాపాడుతూనే ఉంది.
FATF ప్లీనరీ సమావేశానికి కొద్ధి రోజుల ముందు మసూద్ కనబడటం లేదని, అతని ఆచూకీ తెలియడం లేదని పాకిస్తాన్ నివేదించింది. పాకిస్తాన్ సుదీర్ఘకాలం తరువాత ఉగ్రవాద కార్యకలాపాలకు జమ్మాత్ ఉద్ దావా అధినేత హాఫిజ్ సయీద్ కు ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ రెండు చర్యల కాల వ్యవధి విపరీత వివాదాస్పదంగా ఉంది. FATF తమను’ బ్లాక్ లిస్ట్ ‘
లో చేర్చకుండా ఉండేలా పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అని అంతా భావిస్తున్నారు.
మసూద్ అదృశ్యం,హఫీజ్ సయీద్ కారాగారవాసం FATF ప్లీనరీ ముందే చోటుచేసుకోవడంతో పాకిస్తాన్ ఆంతర్యం పై అనుమానాలు రేకెత్తాయి. 2018 జూన్ నుండి ఉగ్రనిధికి దోహదపడిన దేశం అన్న కారణాన ఇస్లామాబాద్ ను గ్రే లిస్టు లో అప్పటికే ఉంచేశారు.ఉగ్రవాద నిధులకు, నగదు అక్రమ లావాదేవీలకు వ్యతిరేకంగా 27 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక ను అమలుపరిచేందుకు పాకిస్తాన్ కు టాస్క్ ఫోర్స్ అందజేసింది. 2020 ఫిబ్రవరి ప్లీనరీ లో పాకిస్తాన్ కేవలం 14 అంశాలపైనే చర్య చేబట్టిందని పేర్కొన్నది. మిగిలిన అంశాలపై కూడా సంపూర్ణంగా చర్య చేబట్టవలసిందిగా కోరింది. లేకుంటే బ్లాక్ లిస్ట్ ను ఎదుర్కోవలసి వస్తుంది.అంత ర్జాతీయ ద్రవ్యనిది,ప్రపంచ బ్యాంకు , యురోపియన్ యూనియన్ ల నుంచి ఆ దేశానికి ఆర్ధిక సాయం కఠినతరమౌతుంది. దాంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.
మసూద్ అజర్ కనిపించకుండా పోయాడని,అతని జాడ తెలియడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం తన వైఖరిని కొనసాగిస్తుండగా , అతను బహవాల్పూర్ లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం వెనుక పాకిస్తాన్ అంతర సేవల నిఘా విభాగపు కనుసన్నలలో భారీ భద్రతలో ఒక సురక్షితమైన ఇంట్లో ఉన్నట్లు విశ్వసనీయ ఇంటెలిజెన్స్ వర్గాల ను ఉటంకిస్తూ పాకిస్తాన్ మీడియా పేర్కొంది. మసూద్ అజర్ ఆనవాళ్ల పై పాకిస్తాన్ ప్రభుత్వ వాదనకు ఇది వ్యతిరేకంగా ఉంది. తాజా అమెరికా తాలిబన్ ఒప్పందానికి సంబంధించి మసూద్ అజర్ మాటలు ఉన్న ఒక క్లిప్పింగ్ ను ఒక పాకిస్తాన్ ప్రైవేట్ ఛానల్ బహిర్గతం చేసింది. వ్యక్తిగత భద్రత దృష్ట్యా అజర్ ను సైనికస్థావరం సమీపానికి రావల్పిండి కి తరలించినట్లు సమాచారం. ఈ చర్య పాకిస్తాన్ ప్రభుత్వ అసత్య ప్రచారాన్ని స్పష్టంగా పటాపంచలు గావిస్తుంది. వాస్తవానికి అతను పాకిస్తాన్ లోనే అధికారిక భద్రతలోనే క్షేమంగా ఉన్నాడు. అతడిని సురక్షితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు మారుస్తున్నారు.
ఈ వ్యూహాలతో పాకిస్తాన్ ఇప్పటికి తీవ్రమైన FATF చర్య నుండి తప్పించుకోగలిగింది. ఇలా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.ఉగ్రవాద బృందాలకు అందించే మద్దతు పై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి ఇప్పటికే బయట పడింది. పాకిస్తాన్ కు అంతర్జాతీయ సమాజంతో తమ సంబంధాలను మెరుగుపరుచుకోవలసిన సమయం ఆసన్నమైంది. భారత్ లో పుల్వామా,బాలాకోట్ వైమానిక స్థావరాలపై దాడి సలిపిన ఉగ్రవాద సూత్రధారులను పాకిస్తాన్ శిక్షించాలి. అలాగే సరిహద్దు వెంట జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను నిలిపి వేయాలి. అప్పుడే ఉగ్రవాదం పై దాడికి పాకిస్తాన్ సుముఖత వ్యక్తమౌతుంది.
రచన : రత్తన్ సల్దీ, రాజకీయ వ్యాఖ్యాత