కొరియా ద్వీపకల్పంలో పెరుగతున్న ఉద్రిక్తతలు

ఈ వారం ప్రారంభంలో ఉత్తర కొరియా మూడు అదృశ్య ప్రక్షేపకాలను ప్రయోగించింది. రెండు వారల సమయంలో కిమ్–జాంగ్- యున్ ప్రభుత్వం రెండవ సారిఇలాటి చర్యకు పాల్పడింది. తొలి ప్రయోగాన్ని ఖండిస్తూ, ప్రతీకార చర్య తప్పదని దక్షిణ కొరియా  హెచ్చరించిన రెండు రోజులకే ఉత్తర కొరియా రెండవ సారి ప్రక్షేపకాలను ప్రయోగించింది. .

ఆదేశ తూర్పు తీర ప్రాంతం నుంచి కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాలలోకి స్వల్ప సామర్ధ్యంగల విభిన్న   ప్రక్షేపకలాను ఉత్తర కొరియా ప్రయోగించిందని, దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా గరిష్టంగా 200 కిలోమీటర్లు దూరంలోని, 50కిలోమీటర్ల ఎత్తులోగల ల్లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం గల ప్రక్షేపకాలను ప్రయోగించింది. ఉత్తర కొరియా మరో మారు ఇలాంటి చర్యలకు పాల్పడితే వాటిని ఎదుర్కునేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని దక్షిణ కొరియా పేర్కొంది. కొరియా ద్వీప కల్పంలో సైనిక ఉద్రిక్తలను చల్లబరిచి, ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు  2018లో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. అంతేకాదు, ఇలాంటి ఉల్లంఘనలను ఉపేక్షించబోమని హెచ్చరిస్తోంది.

కాగా, గత సంవత్సరం ఫిబ్రవరి 28న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’, కిమ్ మధ్య ఒప్పందం కుదరకుండానే ముగిసిన హనోయి శిఘరాగ్ర సదస్సు వార్షికోత్సవం సందర్భంగా సైనిక విన్యాసాలు నిర్వహించామని ఉత్తర కొరియా,మీడియాకు తెలిపింది. వన్సన్ నగరం తూర్పు తీర ప్రాంతం నుంచి ప్యోంగ్యాంగ్’ రెండు స్వల్ప దూర అదృశ్య  ప్రక్షేపకాలను ప్రయోగించడంతో కాల్పులు కొనసాగాయని ఉత్తర కొరియా పేర్కొంది.

ఇదిలా ఉండగా, అమెరికా,ఇదేమీ అనూహ్య పరిణామం కాదని పేర్కొంటూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని పేర్కొంది. అలాగే, దక్షిణ కొరియా, జపాన్’తో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అమెరికా పేర్కొంది. అయితే,అదే సమయమలో అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఉత్తర కొరియాకు సూచించింది. ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు లోబడి, సంపూర్ణ అణునిర్వీర్యీకరణ లక్ష్య సాధనకు చర్చలు జరపాలని అమెరికా ఉత్తర కొరియాకు సూచించింది.

ఉత్తర కొరియా ‘బాలిస్టిక్ క్షిపణుల’ను ప్రయోగించిందేమో అన్న సందేహాలను  జపాన్ వ్యక్త పరిచింది. అయితే, అవి జపాన్ భూభాగంలోకి లేదా ప్రత్యేక ఆర్ధిక మండలి (EEZ)లోకి ప్రవేశించలేదని జపాన్ పేర్కొంది. ఈ చర్యలు జపాన్, సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి విఘాతం కలిపిస్తాయని ,భద్రతను ప్రభావితం చేస్తాయని  జపాన్ పేర్కొంది.

రెండు నెలల విరామం తర్వాత ఉత్తర కొరియా మరో మారు ఇలాంటి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.అమెరికాతో చర్చలు నిలిచిపోయిన నేపధ్యంలో ఉత్తర కొరియా 2019లో మొత్తం 13 సార్లు క్షిపణి ప్రయోగాలు చేసింది. అయితే, కొంతలో కొంత మీరుగా  ప్యోంగ్యాంగ్’ ట్రంప్ ప్రభుత్వాన్ని కలవర పరుస్తున్నఖండాతర శ్రేణి క్షిపణులను మాత్రం ప్రయోగించలేదు. 2019లో జరిపిన క్షిపణి ప్రయోగాలు,‘అత్యంత ప్రామాణికం’ అయినవిగా, అమెరికా ప్రధాన భూభాగానికి ఎలాంటి ప్రత్యక్ష ప్రమాదం లేని క్షిపణులుగా ట్రంప్ పేర్కొన్నారు.అయితే, ఉత్తర కోరిన ప్రయోగించిన ఆయుధాలు దక్షిణ కొరియాకు,అక్కడ ఉన్న 28,000 అమెరికా సైనికులకు గణనీయ ముప్పును కలిగిస్తాయి, అని ట్రంప్ ఆందోళన వ్యక్త పరిచారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్’ 2019లో సంవత్సరాంతానికి అణునిర్వీర్యీకరణ చర్చలను ప్రారంభించాలని అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే, గడవు ముగిసినా  అమెరికాలో కదలిక లేకపోవడంతో కిమ్’ నూతన సంవత్సరం సందేశంలోనే స్పష్టంగా తమ దేశం అణ్వాయుధ పరీక్షల విధించుకున్న స్వీయ నియత్రణకు ఇక కట్టుబడదని, నూతన సంవత్సరంలో అణు పరీక్షలు పునః ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.

అంతే కాదు, కిమ్’ త్వరలోనే ‘కొత్త వ్యూహాత్మక’ ఆయుధాన్ని  చూపుతామని ప్రతిజ్ఞ చేశారు. కిమ్’ప్రకటించిన ‘వ్యూహాత్మక ఆయుధం’ ఖండాంతర క్షిపణి’ లేదా సముద్ర జలాల నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణి అయి ఉంటుందని నిపుణులు అంటున్నారు.అయితే, ఉత్తర కొరియా తాజాగా జరిపిన ఆయుధ పరీక్షలు  కిమ్’ ప్రకటించిన, ‘వ్యూహాత్మక ఆయుధాలు’ కాదు.

ఉత్తర కొరియా సైనిక చర్యలు,  సహజంగా, దేశీయ లేదా అంతర్జాతీయ రాజకీయ పరిణామాలతో  ముడిపడి ఉంటాయి. దేశం వెలుపల నుంచివస్తున్న ముప్పుకు కిమ్’ తమ దేశ ప్రజలలో ధైర్యాన్ని నూరి పోసే చర్యలు చేపడతారు. ఇది కిమ్, రాజకీయ వ్యూహంలో భాగంగా వస్తోంది. సరిహద్దుల వెలుపల ఉత్తర కొరియా ప్రభుత్వం చేపట్టే ఆయుధ ప్రయోగాలు అంతర్జాతీయ దృష్టిని తమ వేపు తిప్పుకునే చర్యల్లో భాగంగా ఉంటాయి.

ప్రస్తుతం దక్షిణ కొరియా, జపాన్,అమెరికా ప్రస్తుతం కరోనా వైరస మహామ్మారితో సతమతమవుతున్నారు. ఉత్తర కొరియా పై దృష్టిని నిలిపి పరిస్థితి ఈ దేశాలకు లేదు. అందుకే సమయం చూసి,తమ దేశంపై ఉన్న విభిన్న  ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికా,జపాన్, దక్షిన కొరియా పై వత్తిడి తెచ్చేందుకు ఉత్తర కొరియా ప్రక్షేపకాలను ప్రయోగిస్తోంది. అదే విధంగా ఎన్నికల మధ్యలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనివార్యంగా అయినా ఎవో కొన్ని రాయతీలు ఇస్తారని కూడా కిమ్ ప్రభుత్వం ఆలోచనగా ఉందని అనుకోవచ్చును. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియా మరింత దూకుడు చూపదని , చూపరాదని, మాత్రమే మనం ఆశించగలం.

కొరియా ద్వీపకల్పంలో,అదేవిధంగా జపాన్ సముద్రం జలాలలో సుస్థిర, సురక్షిత, శాంతి భారత వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు ఎంతైనా అవసరం. గత కొద్ది సంవత్సరాలుగా సున్నితంగా ముందుకు సాగుతున్న ఇండో – పసిఫిక్ స్ట్రాటజీకి కూడా కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి అవసర మని వేరే చెప్పనక్కర లేదు.

 

రచన: అశోక్ సజ్జాన్హర్, భారత మాజీ దౌత్య వేత్త, ప్రెసిడెంట్,  ఇన్స్టిట్యూట్ అఫ్ గ్లోబల్ స్టడీస్