ముడి చమురు ధరలను సౌదీ అరేబియా ‘బ్రెంట్’ ఒక్కసారిగా 30 శాతం తగ్గించాయి. చమురు యుద్ధం మొదలైంది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఒక్క సారిగా ఇంత పెద్ద మొత్తంలో చమురు ధరలు తగ్గడం లేదా తగ్గించడం, ఇదే మొదటి సారి కావడం విశేషం. సౌదీ అరేబియా , రష్యాల మధ్య చమురు ధరలు తగ్గించే విషయంలో విబేధాలు తలెత్తడంతో ఇలా ఒక్కసారిగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి.
కరోన వైరస్ వ్యాప్తి కారణంగా చమురు కొనుగోలు డిమాండ్ తగ్గింది. దీంతో సౌదీ అరేబియా సారధ్యంలోని, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ, ఒపెక్, చమురు ఉత్పత్తిని రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ కు కుదించాలనుకుంది.అయితే అందుకు రష్యా చమురు ఉత్పత్తి తగ్గించేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా, సౌది అరేబియా కంపెనీ బ్రెంట్, ఈ శతాబ్దిలోనే కనిష్ట ధరను ప్రకటించి,చమురు ధరల యుద్దానికి తెర తీసింది.
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్సియల్ మార్కెట్లను, రియల్ ఎస్టేట్ రంగాన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఇంధన రంగంలో పెట్టుబడులను దెబ్బతీయడం మొదలైంది. సౌది అరేబియా చమురు ఉత్పత్తి వ్యయం ఇతర అన్ని దేశాలకంటే లభాలలు చాలా తక్కువ. అంత చౌకగా చమురు ఉత్పత్తి చేయడం మరో దేశానికి సాధ్యం కాదు.చమురు ఉత్పత్తి వ్యయం, లాభ నష్టాలు, బ్రేక్ ఈవెన్ పాయింట్, చమురు సంస్థలు అన్నిటికే ఒకేలా ఉండదు.ఫిస్కల్ బ్రేక్ ఈవెన్ ధర ఉత్పత్తిదారుల చమురు ఉత్పత్తి బ్రేక్ ఈవెన్ సూచిస్తుంది.అలాగే, ఎగుమతి దారులు తమ వాణిజ్య బడ్జెట్’ను బాలన్స్ చేసుకునేందుకు కూడా ఫిస్కల్ బ్రేక్ ఈవెన్ సూచికగా నిలుస్తుంది.
రష్యా ఫిస్కల్ బ్రేక్ ఈవెన్ ధర, బ్యారెల్కు 42 డ్లర్లు అయితే, సౌది ఆర్మ్’కో ఫిస్కల్ బ్రేక్ ఈవెన్ 83.60 డాలర్లు.అందుకే, రియాద్ బ్రెంట్ బ్యారెల్ చమురు ధరను 31 డాలర్లకు తగ్గించడంతో చమురు ధరల సుదీర్ఘ యుద్దానికి తెరతీసినట్లయింది. చమురు సంస్థలు పోటీపడి ధరలను తగ్గిస్తున్నాయి.
అయితే, ఈ విధంగా బ్రెంట్ కనిష్ట స్థాయికి తగ్గిచడం వలన, మందగమనం సాగిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుందా ? చేయూత నిస్తుందా? అంటే, ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం సాధ్యం కాదు.ముఖ్యంగా తగ్గిన ధరలు ఎంతవరకు వినియోగదారులకు చేరతాయి.. పెట్టుబడి దారులకు ఎంతవరకు అందుతాయి అనేది చెప్పడం సాధ్యం కాదు. చమురు ధరల తగ్గింపు నిర్ణయం ఇంధన రంగంలో పెట్టుడులపైన ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని , అదే విధంగా ప్రపంచ వృద్ధి రేటును వెనక్కి నేడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అదే విధంగా పన్నుభారం లేకుండా ఉంటేనే చమురు ధరల తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా, ఇంధన రంగంలో ద్రిల్లింగ్ కార్యకలాపాలు తగ్గిపోవచ్చును.ఫలితంగా కొరత ఏర్పడే వచ్చును. ఇదిలా ఉంటే, మరో వంక, అమెరికాలోని ప్రసిద్ద షెల్ ఆయిల్ ఇండస్ట్రీఫై అప్పుల భారం ప్రభావం చూపుతుంది. అయితే, చమురు పరిశ్రమ ‘పరిమిత’ పరిశ్రమ కావడంవలన చమురు ధరలు ప్రవేశస్థాయి నుంచి దిగువకు పడిపోయినా ఉత్పత్తి దారులపై అంతగా ప్రభావం ఉండదు. చమురు ధరల పరిమితులు, పెట్టుబడి శ్రేణులు తగ్గినా చమురు ధరల నుంచి బాలన్స్ షీట్స్ ను సురక్షితంగా కాపాడతాయి. అయితే, మూడు చమురు వాటాదారుల నుంచి ఈక్విటీ మార్కెట్స్ దూరంగా జరిగి పోతున్నాయి.
చమురు ధరలు పది డాలర్లు పడిపోతే, చమురు ఉత్పత్తి దేశాల నుంచి సుమారు 0.3 శాతం ప్రపంచ జీడీపీ చమురు వినియోగ దేశాలకు చేరుతుందని విశ్లేషకులు తెలిపారు.అలాగే,రష్యా 10 సంవత్సరాల బాండ్లపై వచ్చే ఆదాయం,అత్యల్పంగా 2.56 శాతానికి పడిపోవడంతో పాటుగా ఏప్రిల్ 2030నాటికి చెల్లింపులకు వచ్చే సౌదీ అరేబియా ప్రభుత్వ బాండ్లపై వచ్చే ప్రస్తుత ఆదాయం 2.38 శాతంగా ఉన్న నేపధ్యంలో చంరు ధరల తగ్గింపు వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.అమెరికాలో ఇంధన రంగంలో పెట్టుబడుల రుణం చౌకగా లభిస్తోంది.ప్రస్తుతం అమెరికాలో ఇంధన పెట్టుబడులు వడ్డీ రేటు 2.95 శాతంగా ఉంది. ఈ నేపధ్యంలో చమురు ధరల యుద్ధం ఇటు కమోడిటీ మార్కెట్’ను అటు కాపిటల్ మార్కెట్’ను కూడా దెబ్బ తీస్తుంది.
చమురు వినియోగంలో భారత దేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. రియాద్, రష్యాతో పోటీ పడి చమురు ధరలను కనిష్ట స్థాయికి తగ్గించడం, అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అమెరికా షెల్ తీసుకునే నిర్ణయాలు భారత్ దేశం పై సానుకూల ప్రభావం చూపుతాయి . భారత దేశానికి ఫిస్కల్ డివిడెంట్ లభిస్తుంది. బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్’కు 20 డాలర్లు తగ్గితే, భారత దేశ కరెంటు ఎకౌంటు లోటు 30బిలియన్ డాలర్ల మేర తగ్గుతుంది.అయితే అస్థిర చమురు దాహ్ర్లు అట్టేకాలం కొనసాగవు, కాబట్టి భారత్ దేశానికి సుదీర్ఘ కలమ పటు ప్రయోజనం చేకురుతుందని అనుకోలేము.
రష్యా, సౌదీ అరేబియా గత మూడు సంవత్సరాలుగా ఉత్పత్తిని అదుపులో ఉంచి చమురు ధరలను పెంచుకునే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో అమెరికా షెల్ కంపెనీ మార్కెట్ షేర్ పెంచుకుంది. అపరిమిత లాభాలను అర్జించింది. అయితే,రష్యా ఇంధన రంగంపై అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో భౌగోళిక రాజకీయ ఆందోళన వ్యక్తమైంది.ఇప్పడు ధరల యుద్ధంతో, రష్యా ఏకపక్షంగా విభిన్న పంధాను ఎంచుకుంది. ఉత్పత్తిని పెంచి ధరలనుతగ్గించాలని నిర్ణయించింది.ఈ పరిణామాల దుష్ప్రభావం సౌది అరేబియా సారధ్యంలోని ఒపెక్ కార్టేల్ పై బలంగా ఉంటుంది.
రచన: డాక్టర్ లేఖ ఎస్. చక్రవర్తి ప్రొఫెసర్ NIPFP &రీసెర్చ్ అసోసియేట్, లెవీ ఎకనమిక్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ బార్డ్ కాలేజీ, న్యూయార్క్